ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధ నిబంధనలు-1945ను సవరించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ: చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ ల అమ్మకాలకు మినహాయింపు ఉపసంహరణ


దగ్గు సిరప్‌లపై నియంత్రణను బలోపేతం చేసేలా ఔషధ నియమాల్లో కీలక సవరణపై ప్రభుత్వ ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 16 JUN 2026 11:41AM by PIB Hyderabad

ఔషధ నియమాలు-1945కు చేసిన సవరణను ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2025 డిసెంబర్ 29 నాటి గెజిట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 927 (ద్వారా అమల్లోకి తీసుకువచ్చిందిదీనిని 2025 డిసెంబర్ 30న గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్‌ట్రార్డినరీలోని పార్ట్ II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (I)లో ప్రచురితమైందిదీని ప్రకారం.. ‘‘ఔషధాల వర్గం’’ విభాగంలోని షెడ్యూల్ కేసీరియల్ నెంబరు 13, ఎంట్రీ నుంచి ‘సిరప్’ అనే పదాన్ని తొలగించింది.

 

కొన్ని నిర్ధిష్టమైన రకాల ఔషధాలకు ఔషధాలుసౌందర్య సాధనాల చట్టం - 1940లోని నిబంధనల ప్రకారం ఔషధ నియమాలు-1945లోని షెడ్యూల్ కే మినహాయింపులను ఇస్తుందిఈ సవరణకు ముందు వరకుషెడ్యూల్ కే లోని ఎంట్రీ నంబర్ 13 ప్రకారం.. 1,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలోకొన్ని చిల్లర విక్రయ అనుమతి నిబంధనల అవసరం లేకుండానే దగ్గు సిరప్‌లను విక్రయించడానికి అనుమతి ఉండేది.

 

 

పైన పేర్కొన్న ఎంట్రీ నుంచి ‘‘సిరప్’’ అనే పదాన్ని తొలగించడంతోఇకపై దగ్గు సిరప్‌లకు ఈ మినహాయింపు లభించదుదీని ఫలితంగాచిన్న గ్రామాల్లో ఔషధాలుసౌందర్య సాధనాల చట్టం - 1940, అందులోని నిబంధనల ప్రకారం సరైన అనుమతులున్న ఫార్మసీల ద్వారా మాత్రమే దగ్గు సిరప్‌ల అమ్మకాలుపంపిణీ జరగాల్సి ఉంటుంది.

 

సిరప్ తయారీపై నిరంతర పర్యవేక్షణను బలోపేతం చేయడానికీప్రస్తుత ప్రజారోగ్యంభద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మినహాయింపుల విధానాన్ని మార్చడానికి ఈ సవరణను చేపట్టారుఈ చర్య దేశవ్యాప్తంగా దగ్గు సిరప్‌ల బాధ్యతాయుతమైన పంపిణీఅమ్మకాలను ప్రోత్సహిస్తుందనీఅదే సమయంలో నియంత్రణా ప్రమాణాలను మరింత మెరుగ్గా పాటించేలా చేస్తుందనీ భావిస్తున్నారు.

 

ఔషధాలుసౌందర్యసాధనాల చట్టం - 1940, ఔషధ నియమాలు - 1945 ప్రకారం వర్తించే లైసెన్సునియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని దగ్గు సిరప్‌ల తయారీదారులుపంపిణీదారులురీటైలర్లకు సూచించడమైనది.

 

దిగువ పేర్కొన్న లింకులో గెజిట్ నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

 

https://egazette.gov.in/WriteReadData/2026/273467.pdf

 

****


(రిలీజ్ ఐడి: 2273529) సందర్శకుల సూచీ సంఖ్య : : 106
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada