ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JUN 2026 11:33PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవనంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యారు.

ఫిబ్రవరి-2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా అధ్యక్షుడు పెల్లెగ్రినితో జరిగిన సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సహకారం పట్ల ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారువాణిజ్యంపెట్టుబడులుసాంకేతికతప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను స్వాగతించారుఇరువురికి ఆసక్తి గల ప్రాంతీయప్రపంచ పరిణామాలపైనా చర్చించారు.

అధ్యక్ష భవనంలో వారణాసి నగరం ఇతివృత్తంతో స్లోవాక్ కళాకారులు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఅధ్యక్షుడు పెల్లెగ్రినితో కలిసి తిలకించారుస్లోవాక్ పాఠశాల విద్యార్థుల ప్రత్యేక యోగా ప్రదర్శనను కూడా వారు తిలకించారు.

ప్రధానమంత్రికి గౌరవార్థం అధ్యక్షుడు పెల్లెగ్రిని విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారుఈ సందర్భంగా లభించిన ఆత్మీయతఆతిథ్యానికిభారత్-స్లోవేకియా భాగస్వామ్యానికి అధ్యక్షుడు పెల్లెగ్రిని అందిస్తున్న మద్దతుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2273465) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam