ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయ ఏఐ మోడల్ ‘వర్య’ను ప్రారంభించిన ఇండియా ఏఐ మిషన్... తక్కువ ధరకే నాణ్యమైన సేవలందిస్తామంటున్న వీడియో స్టోరీ జనరేటింగ్ ఏఐ మోడల్


ఏఐ మిషన్ అండదండలతో దీనిని రూపొందించిన అవతార్ ఏఐ.. వీడియో తయారీకి పట్టే సమయాన్ని 50 దశల నుంచి 4కు తగ్గిస్తామంటున్న ‘వర్య’ – ఇప్పుడున్న ప్రముఖ మోడళ్ల కన్నా పది రెట్లు అధిక సామర్థ్యం

విద్య నుంచి ఇ-కామర్స్ వరకు.. భారత్‌లో భారీ స్థాయిలో అందుబాటు ధరలో ఏఐ వీడియో తయారీ సేవలను అందించనున్న ‘వర్య’... తగిన ప్రాంప్ట్ ద్వారా వచనాన్ని వీడియోలుగా మార్చగల సమర్థత

प्रविष्टि तिथि: 12 JUN 2026 3:09PM by PIB Hyderabad

‘వర్య’ పేరుతో ఒక సరికొత్త డిస్టిల్డ్ వీడియో మోడల్‌ను విడుదల చేస్తున్నట్టు ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫామేషన్ కంపెనీ అవతార్ ఈ రోజు ప్రకటించింది. దేశంలో తదుపరి తరం వినియోగదారులకు అత్యాధునిక వీడియో ఏఐ సాంకేతికతను మరింత అందుబాటు ధరల్లోసులభంగావారి అవసరాలకు ఉపయోగపడేలా అందించే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఈ సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్అవతార్ సంస్థ ఉన్నతాధికారుల బృందం సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఒకే సాధారణీకరణతో కాకుండాదేశంలోని విభిన్న ప్రాంతీయ పరిస్థితులకు తగ్గట్టుగా ‘వర్య’ను రూపొందించారు. మన దేశంలోని విభిన్న ప్రాంతాలుపండుగలుసంస్కృతులుఆహార అలవాట్లువస్త్రధారణరోజువారీ జనజీవన వైవిధ్యాన్ని అర్థం చేసుకుని.. సాంస్కృతికంగా అత్యంత దగ్గరగా ఉండే దృశ్యాలను ఇది సృష్టిస్తుంది. ఒక పల్లెటూరి తరగతి గదిలో ఓ టీచర్ దృశ్యరూపంలో పాఠాలను తయారు చేయడం నుంచి.. ఒక ఎంఎస్ఎంఈ తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలను రూపొందించే వరకుఅలాగే ఒక సామాన్య పౌరుడు వీడియో ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకోవడం వరకు... ఇలా ప్రతి చిన్న ఆలోచనను ఒక చక్కని దృశ్య కథనంలా చిత్రించడమే ‘వర్య’ లక్ష్యం.

దేశీయంగా ప్రాథమిక ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ‘ఇండియాఏఐ మిషన్’ ఎంపిక చేసిన కంపెనీల్లో ‘అవతార్’ ఒకటి. ప్రభుత్వం రాయితీపై అందించిన జాతీయ స్థాయి ఏఐ కంప్యూట్ సాంకేతిక మౌలిక సదుపాయాల వల్ల.. ‘వర్య’ ఆవిష్కరణకు దారితీసిన పరిశోధనలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వ ఏఐ మౌలిక సదుపాయాలు దేశీయ ఆవిష్కరణలను ఎంత వేగంగా ముందుకు నడిపించగలవో చెప్పడానికి ఇది నిదర్శనం.

విద్యవ్యాపారంకమ్యూనికేషన్కథా కథనాల్లో వీడియోనే ప్రధాన మాధ్యమంగా మారిన నేపథ్యంలో.. అత్యుత్తమ నాణ్యత కలిగిన వీడియో కంటెంటును సమర్థంగా సృష్టించగలగడం అత్యంత కీలకమైన అంశం.

‘ఇండియాఏఐ మిషన్’ సహకారంతో రూపొందించిన ‘వర్య’.. ఒక ప్రత్యేకమైన డిస్టిలేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా వీడియో రూపకల్పనకు పట్టే 50 దశల ప్రక్రియను కేవలం 4 దశలకు తగ్గిస్తుంది. అయినా వీడియో నాణ్యతలో రాజీ పడదు. అవతార్ సంస్థ అంతర్గత అంచనాల ప్రకారం.. వర్య ద్వారా కేవలం సెకనుకు 48 పైసలకే వీడియోను రూపొందించవచ్చు. ప్రముఖ అంతర్జాతీయ వీడియో ఏఐ మోడళ్లతో పోలిస్తే దాదాపు 10 రెట్ల తక్కువ వ్యయంతోనే ఇది వీడియోను అందిస్తుంది.

ఆలోచన  వీడియో  కథనం అనే సులభమైన సూత్రం ఆధారంగా ‘వర్య’ పనిచేస్తుంది. వినియోగదారులు తమ ఆలోచనను టైప్ చేసి, ఒక చిత్రాన్ని అప్‌లోడ్ చేసి వీడియోను సృష్టించవచ్చు. అదనపు క్లిప్‌లను జోడిస్తూ ఆ కథనాన్ని కొనసాగించవచ్చు. వినియోగదారులు అందించే నిర్దేశం (ప్రాంప్ట్).. డిజిటల్ పాఠంగానో, ప్రకటనగానో, మార్గనిర్దేశంగానో, ఒక చిత్రంగానో లేదా ఒక తీపి జ్ఞాపకంగానో రూపుదిద్దుకుంటుంది.

కొన్ని లక్షల మందికే పరిమితం కాకుండా, భారత్‌లో వందకోట్లకు పైగా ప్రజల కోసం ఏఐ సేవలందించాలి. ఇక్కడ ఏఐ సామర్థ్యం సాంకేతిక అంశం మాత్రమే కాదు.. సమ్మిళితత్వానికి అది పునాది.

వర్య - భారత ఏఐ ఆశయాలకు నిదర్శనం

ప్రారంభోత్సవం సందర్భంగా కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా ఏఐ మిషన్ సాయంతో రూపొందించిన ప్రాథమిక మోడళ్లలో ఇదొకటి. ‘వర్య’ ప్రారంభం దేశ ఏఐ ప్రస్థానంలో కీలకమైన మైలురాయి. మనం సాకారం చేసుకోవాలని ఆశిస్తున్న పరిశోధన ఆధారిత నైపుణ్యాభివృద్ధికి వర్య నిదర్శనం. దేశీయ ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంతోపాటు, శక్తిమంతమైన డీప్‌టెక్ వ్యవస్థను ప్రోత్సహించడం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబించే తరుణమిది. ఇది మాకెంతో గర్వకారణం. ప్రాథమిక మోడళ్లకు వ్యూహాత్మకంగా మద్దతునివ్వడం ద్వారా.. విస్తృతంగా ఆవిష్కరణలను సాకారం చేస్తున్నాం. తదుపరి తరం ఏఐ సాధనాల కోసం పటిష్టమైన పునాదులను ఏర్పరుస్తున్నాం. భారత ఏఐ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతోపాటు, పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు అందుబాటులో ఉండేలా.. తక్కువ వ్యయంతో కూడిన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తున్నాం’’ అన్నారు.

వర్య మోడల్ ఆర్కిటెక్చర్డిస్టిలేషన్ విధానం, ప్రమాణాలను వివరిస్తూ.. ఒక సాంకేతిక నివేదికను కూడా అవతార్ ప్రచురిస్తుంది.

వర్య ఆవిష్కరణ ద్వారా తక్కువ వ్యయంతో ఏఐ

ప్రారంభోత్సవం సందర్భంగా అవతార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు స్రవంత్ ఆలూరు మాట్లాడుతూ.. ‘‘కేవలం పెద్ద పెద్ద మోడళ్లే భారత్‌లో ఏఐ అవకాశాలను నిర్దేశించవు. అత్యంత సమర్థమైన మోడళ్లతోనే ఆ అవకాశాలు లభిస్తాయి. అత్యుత్తమ నాణ్యత కలిగిన వీడియో ఏఐ సాంకేతికతను కూడా సమర్థంగా, సామాన్యులకు అందుబాటులోకి తేవచ్చని వర్య నిరూపించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో.. అందుబాటులో వ్యయం అన్నది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు, అదొక ప్రాథమిక అవసరం. భవిష్యత్తులో రాబోయే వంద కోట్ల కథనాలు, డిజిటల్ పాఠాలు, ప్రకటనలు, సేవలు, సరికొత్త అనుభూతులను ఏఐ సృష్టిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. ఆ సామర్థ్యం కొద్దిమందికే కాకుండా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’’ అన్నారు.

‘‘అందుబాటు ధరల్లో ఏఐ లభిస్తేనే అందరికీ అందుబాటులో ఉంటుంది. వర్య ద్వారా అవతార్ సంస్థ సాధించిన విజయం చాలా కీలకమైనది. ఎందుకంటే, ఇది ఏఐ సామర్థ్యానికి మాత్రమే కాదు.. అందరికీ ఏఐ లభ్యత దిశగా చర్చలను మళ్లించింది. భారీ జనాభా అవసరాలకు తగిన ఏఐ ఉత్పత్తులను రూపొందించడానికి కావలసిన ప్రతిభ, మార్కెట్ విస్తృతి, సృజనాత్మకత భారత్‌లో ఉన్నాయి. కేవలం పెద్దపెద్ద మోడళ్లను నిర్మించడం ద్వారానే కాకుండా.. మన స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా, అందరికీ మరింతగా అందుబాటులో ఉండేలా అత్యంత సమర్థమైన ఏఐ మోడళ్లను రూపొందించడం ద్వారా కూడా భారతీయ కంపెనీలు ప్రపంచస్థాయిలో పోటీ పడగలవని చెప్పడానికి ‘వర్య’ ఒక బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అవతార్ గురించి

ప్రముఖ ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ అవతార్. వివిధ రంగాల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకమైన ఏఐ ఉత్పత్తులను ఈ సంస్థ రూపొందిస్తుంది. ఇవి వ్యాపార సంస్థల పనితీరులో సామర్థ్యాన్ని పెంచడానికి, సరికొత్త వ్యాపార నమూనాలను పరిచయం చేయడానికి, మేధో సంపత్తి ప్రాతిపదికగా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తోడ్పడతాయి. క్రమంగా విస్తరిస్తున్న మార్కెట్లలో.. నిత్యజీవితంలో వ్యాపారాలు, వినియోగదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో కృత్రిమ మేధ సాంకేతికతను వర్తింపజేయడంపై ఈ కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.

డిస్టిలేషన్ పద్ధతిలో వీడియోలను రూపొందించడమెలా

డిస్టిలేషన్ అనేది మెషిన్ లెర్నింగ్‌లో ఉపయోగించే మోడల్ కంప్రెషన్ సాంకేతికత. పరిమాణంలో పెద్దదైన, నెమ్మదిగా పనిచేసే ఒక ‘టీచర్’ మోడల్ ఇచ్చే ఫలితాలను.. డిస్టిల్డ్ సాంకేతికతలో ఒక చిన్నపాటి ‘స్టూడెంట్’ మోడల్ ద్వారానే పొందవచ్చు. ముఖ్యంగా అవసరం లేని అదనపు గణనలను తొలగిస్తూ వేగంగా ఫలితాలనిచ్చేలా చేస్తుంది. సాధారణ వీడియో మోడళ్లు ఒక స్పష్టమైన వీడియోను రూపొందించే ముందు 50కి పైగా క్లిష్టమైన దశలను దాటాల్సి ఉంటుంది. అయితే, అనవసర దశలను దాటవేయడాన్ని స్టూడెంట్ మోడల్‌కు ఈ డిస్టిలేషన్ పద్ధతి నేర్పిస్తుంది. దాంతో తక్కువ దశల్లోనే అంతే నాణ్యత కలిగిన వీడియోలు సిద్ధమవుతాయి. భారత్‌లో వీడియో రంగానికి ఈ సంచలనాత్మక సాంకేతికతను ‘వర్య’ తొలిసారిగా పరిచయం చేస్తోంది. దీంతో అత్యుత్తమ నాణ్యత కలిగిన వీడియో తయారీ అత్యంత తక్కువ ఖర్చుతో, వేగంగా.. దేశంలోని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుంది.  

 

***


(रिलीज़ आईडी: 2273216) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam