యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్ యూత్ పార్లమెంట్-2026ను రేపు ప్రారంభించనున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా


చర్చల నుంచి తీర్మానాల వరకు... నారీశక్తి వందన్: సమ్మిళితత్వానికి ఊతం, వికసిత భారత్ - 2047 అంశాలపై చర్చ

పార్లమెంటరీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించనున్న యువత: పరిపాలన వ్యవహారాలపై స్పష్టమైన అవగాహన

దేశ పురోగతి, పరిపాలన వ్యవహారాల్లో యువతను ముందంజలో నిలిపేలా కార్యక్రమం

प्रविष्टि तिथि: 15 JUN 2026 2:06PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడలు కార్మికఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో.. యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2026 జూన్ 15 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026’ను నిర్వహిస్తోందిజాతీయ స్థాయి వికసిత భారత్ యూత్ పార్లమెంటును గౌరవ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2026 జూన్ 16న ప్రారంభిస్తారువిజయవంతమైన గత ఎడిషన్ల అనుభవంతో ఈ యేడూ ప్రతిష్ఠాత్మకంగా యూత్ పార్లమెంటును నిర్వహిస్తున్నారుప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగస్వామ్యాన్ని పునస్సమీక్షిస్తూ.. పరిపాలనవిధాన చర్చలుపార్లమెంటరీ వ్యవహారాలపై యువతకు ప్రత్యక్ష అవగాహనను ఈ కార్యక్రమం అందిస్తుంది.

వికసిత భారత్ యూత్ పార్లమెంట్’ కేవలం అధికారికంగా నిర్వహించే ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. దేశ యువత శక్తినీఆలోచనలనూఆశయాలనూ జాతీయ స్థాయి చర్చల్లో భాగస్వామ్యం చేసే ఉద్యమమిదిసెంట్రల్‌హాల్‌లో వారు చేసే తీర్మానాలు.. ఈ మూడు రోజులకే పరిమితం కాదువికసిత భారత్ - 2047 దిశగా భారత్ ప్రస్థానాన్ని ముందుండి నడిపేలా ఈ తరం యువ నాయకులందరికీ స్ఫూర్తినిచ్చేలా ఇవి నిలుస్తాయి.

మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారుయువత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రతి దశనూ రూపొందించారు:

  • జిల్లా స్థాయిలో నోడల్ దశ:

  • అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి 50 ఏళ్లపై విస్తృత స్థాయి చర్చలు757 నోడల్ విశ్వవిద్యాలయాలువిద్యాసంస్థల్లో దేశ ప్రజాస్వామ్య సంబంధిత పాఠ్యాంశాలను బోధించారుతద్వారా ఈ చర్చ దేశంలోని నలుమూలకూ చేరింది.

  • ప్రతి జిల్లా నుంచి మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం లభించింది.

    రాష్ట్ర స్థాయి దశ:

  • అన్ని రాష్ట్రాల్లోని శాసనసభలుప్రముఖ ప్రభుత్వ వేదికల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ‘కేంద్ర బడ్జెట్ 2026: యువశక్తి ప్రాతిపదికగా బడ్జెట్’కు సంబంధించి ప్రాంతీయ పాలన విధానాలపై యువతకు అర్థవంతమైన అవగాహన కల్పించేలా ఈ దశ కార్యక్రమాలు దోహదపడ్డాయి.

  • రాష్ట్ర శాసనసభ స్పీకర్లుగవర్నర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలు.. ప్రభుత్వ చర్చల్లో యువత భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని పెంచాయి.

    జాతీయ స్థాయి దశ (2026 జూన్ 15–17):

  • అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతినిధులు న్యూఢిల్లీలో తుది కార్యక్రమంలో పాల్గొంటారు.

  • జాతీయ దశలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి:

  • ప్రారంభోపన్యాసం: ‘నారీ శక్తి వందన్సమ్మిళితత్వానికి ఊతంవికసిత భారత్ - 2047’ అంశంపై ప్రతి జట్టు నుంచీ ఒక్కో ప్రతినిధి సభను ద్దేశించి నిమిషాలు మాట్లాడుతారు.

  • ప్రశ్నోత్తరాల సమయం: యూత్ పార్లమెంటులో పాల్గొనే బృందాలన్నీ నిజమైన పార్లమెంటరీ స్ఫూర్తితో ప్రశ్నలు వేసివాటిపై ప్రతిస్పందిస్తాయిప్రశ్నకు నిమిషాలుసమాధానమివ్వడానికి నిమిషాలు... ఈ విధంగా ఒక సామూహిక తీర్మానాన్ని వారు ఆమోదిస్తారు.

  • నిపుణులతో తరగతులువక్తృత్వంప్రజలనుద్దేశించి ప్రసంగించడంపై నిష్ణాతుడితో అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తారువారి నాయకత్వ నైపుణ్యాలకు ఇది మరింత పదును పెడుతుంది.

  • పీఎం సంగ్రహాలయ సందర్శనపీఎం సంగ్రహాలయను ప్రత్యేకంగా సందర్శించడం ద్వారా.. సుసంపన్నమైన దేశ రాజకీయ వారసత్వాన్నీనాయకత్వ పరంపరనూ ప్రతినిధులు పరిశీలిస్తారు.

  • కొత్త పార్లమెంటు సందర్శనదేశ నూతన పార్లమెంటు భవనంలో పర్యటన అభ్యర్థులకు కొత్త స్ఫూర్తినిస్తుందిఇది వారికి దేశ ప్రజాస్వామ్య మూలాలతో ప్రత్యక్షానుబంధాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

  • పురస్కార ప్రదానోత్సవంఈ కార్యక్రమంలో భాగస్వాములైన యువ విశేష కృషికి గుర్తింపుగా.. జూన్ 17న ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ పురస్కారాలను అందిస్తారు.  

***


(रिलीज़ आईडी: 2273037) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Telugu_Vw , Kannada , Malayalam