MIFF banner

వేవ్స్ డాక్ బజార్ 2026లో ప్రదర్శించడానికి 'వేవ్స్ డాక్ బజార్ రికమెండ్స్'


కింద ఎంపికైన ప్రాజెక్టులను ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

వేవ్స్ డాక్ బజార్ కు 19 దేశాలు,35 భాషల నుంచి వచ్చిన 155 అంతర్జాతీయ ప్రతిపాదనల్లో 12 ప్రాజెక్టుల ఎంపిక

వేవ్స్ డాక్ బజార్ 2026లో పాల్గొనే మూడు అత్యుత్తమ ప్రాజెక్ట్‌లకు రూ.3లక్షల చొప్పున నగదు బహుమతులను అందిస్తున్న ఎన్ఎఫ్‌డీసీ

19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 కు అనుబంధంగా జరగనున్న రెండో వేవ్స్ డాక్ బజార్  కోసం 'వేవ్స్ డాక్ బజార్ రికమెండ్స్కార్యక్రమం కింద ఎంపికైన ప్రాజెక్టులను జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్‌డీసీప్రకటించింది.

ఎంఐఎఫ్ఎఫ్ మార్కెట్ విభాగాన్ని 2026 జూన్ 16 నుంచి 18 వరకు ముంబయిలోని డాక్టర్ గోపాలరావు దేశ్‌ముఖ్ మార్గ్‌లో ఉన్న ఎన్ఎఫ్‌డీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారుఇది డాక్యుమెంటరీషార్ట్ ఫిల్మ్యానిమేషన్ రంగాలకు చెందిన చిత్ర దర్శకులునిర్మాతలుబ్రాడ్‌కాస్టర్లుపంపిణీదారులుచలనచిత్రోత్సవ నిర్వహకులుపరిశ్రమ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానుంది.

వ్యూయింగ్ రూమ్వర్క్-ఇన్-ప్రోగ్రెస్ లాబ్బిజినెస్-టు-బిజినెస్ మీటింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా భాగస్వామ్యాలునెట్‌వర్కింగ్మార్కెట్ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కూడిన పారిశ్రామిక వేదికగా  వేవ్స్ డాక్ బజార్ సేవలందిస్తుంది.

కొత్త ప్రతిభను ఆదరించడానికిప్రభావవంతమైన కథలను ప్రోత్సహించడానికి వేవ్స్ డాక్ బజార్ 2026లో పాల్గొనే మూడు అత్యుత్తమ ప్రాజెక్టులకు ఒక్కో దానికి మూడు లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతులను ఎన్ఎఫ్‌డీసీ అందిస్తోందిభారత్ తో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం ఉండిఅసాధారణమైన సృజనాత్మక దృక్పథంబలమైన కథనంఅత్యుత్తమ కళాత్మక విలువలను ప్రదర్శించే ప్రాజెక్టులను ఈ బహుమతుల ద్వారా గుర్తిస్తారు.

'వేవ్స్ డాక్ బజార్ రికమెండ్స్ఎంపికలో మొత్తం 12 ప్రాజెక్టులు ఉన్నాయిఇందులో 'వర్క్-ఇన్-ప్రోగ్రెస్ లాబ్'  లో పాల్గొనే నాలుగు ప్రాజెక్టులు కూడా కలిసి ఉన్నాయిడబ్ల్యూఐపీ లాబ్ ద్వారా ఎంపికైన చలనచిత్ర రూపకర్తలు తమ చిత్రాల రఫ్ కట్‌లను అంతర్జాతీయ సలహాదారులుఎడిటర్లతో కూడిన ప్యానెల్‌ ముందు ప్రదర్శిస్తారుతద్వారా వారు తమ ప్రాజెక్టులను మరింత మెరుగుపరచుకునేందుకు అవసరమైన విలువైన సూచనలుసలహాలుమార్గదర్శకత్వాలను పొందుతారుతమ చిత్రాలు విస్తృత పరిశ్రమ భాగస్వామ్యంపంపిణీ అవకాశాలకు సిద్ధమయ్యేలా అవసరమైన సహకారాన్ని కూడా అందుకుంటారు.

వేవ్స్ డాక్ బజార్ రికమెండ్స్ లైనప్ కింద కూడా ఎనిమిది ప్రాజెక్టులు ఎంపికయ్యాయిఇప్పటికే పూర్తయిన లేదా పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశల్లో ఉన్న ఈ చిత్రాలు అమ్మకాలు పంపిణీప్రదర్శన అవకాశాల కోసం చూస్తున్నాయిఈ కార్యక్రమం మార్కెట్ ప్రవేశాన్నివిస్తృతమైన ప్రేక్షకులను చేరుకునే మార్గాలను అన్వేషించడానికి వీలుగా కొనుగోలుదారులుపంపిణీదారులుబ్రాడ్‌కాస్టర్లుస్ట్రీమింగ్ వేదికలుఇతర పరిశ్రమ భాగస్వాములతో పరస్పర చర్చలకు దోహదపడుతుంది.

ఎంపికైన మొత్తం 12 ప్రాజెక్టులూ బజార్ ప్రారంభ రోజైన 2026 జూన్ 16న జరిగే ఓపెన్ పిచ్ సెషన్‌లోపాల్గొంటాయిఈ సెషన్ చలనచిత్ర రూపకర్తలకు తమ ప్రాజెక్టులను కొనుగోలుదారులుపంపిణీదారులుబ్రాడ్‌కాస్టర్లుచలనచిత్రోత్సవ  ప్రతినిధులతో కూడిన పరిశ్రమ నిపుణుల ముందు ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తుందిపాల్గొనేవారు తమ చిత్రాల విశిష్టమైన దృక్పథాన్ని ప్రదర్శించడానికి తోడ్పడటంతో పాటుఅర్థవంతమైన భాగస్వామ్యాలను సహకారాలను పెంపొందించుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

వేవ్స్ డాక్ బజార్ రెండో ఎడిషన్ ప్రత్యేకతల్లో వ్యూయింగ్ రూమ్  ఒకటిఇది చలనచిత్ర నిర్మాతలు తమ సృష్టిని పరిశ్రమ భాగస్వాములకు ప్రదర్శించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ లైబ్రరీ వేదికఇది నెట్‌వర్కింగ్పంపిణీకొనుగోలు  అవకాశాలను సులభతరం చేస్తుంది.

ఈ సంవత్సరంవ్యూయింగ్ రూమ్ 19 దేశాల నుంచి  35 భాషలలోని 155 ప్రాజెక్టులను ప్రదర్శించనుందిఇది కొనుగోలుదారులుబ్రాడ్‌కాస్టర్లుపంపిణీదారులుచలనచిత్రోత్సవ నిర్వాహకులుఇతర పరిశ్రమ భాగస్వాములకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ కథనాలువిభిన్న దృక్పథాల సంపన్నమైన వైవిధ్యాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది.

వర్క్-ఇన్-ప్రోగ్రెస్ లాబ్ కోసం ఎంపికైన  నాలుగు ప్రాజెక్టుల వివరాలు:

  1. అడ్యు డిల్లీదర్శకులు నందన్ సక్సేనాకవితా బహీ

  2. ఇట్ టేక్స్ ఎ విలేజ్:  దర్శకుడు ఇంద్రజీత్ మోరే

  3. కుంచోక్ అండ్ హిస్ మెనీ మూన్స్దర్శకుడు అశోక్ మీనా

  4. ఆన్ ఎ గుడ్ నోట్దర్శకురాలు కరిష్మా రావు

వేవ్స్ డాక్ బజార్ రికమెండ్స్ 2026  కింద ఎంపికైన  ఎనిమిది చిత్రాల వివరాలు

  1. బై ది హోమ్ దర్శకుడుమంకాప్ నోక్వోహామ్

  2. దో చార్ దిన్ దర్శకురాలుసాన్యా ఆనంద్

  3. ఎచె  దర్శకుడుడింగ్కు థింగ్‌నామ్

  4. రస నిష్పతి -దర్శకుడుహరీష్ కెఎం.

  5. రైజ్  దర్శకుడుఅరస్తు జకియా

  6. ది గర్ల్ బినీత్ ది సన్  దర్శకురాలుమధురిమా మైతి

  7. తురు  దర్శకుడురామేశ్వర్ భట్

  8. టుక్రో టుక్రో పృథిబి  దర్శకురాలుఅస్మితా పాల్.

ఎంపికైన ఈ ప్రాజెక్టులు సమకాలీన డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలోని వైవిధ్యాన్నిసృజనాత్మకతనుసామర్ధ్యాలను ప్రతిబింబిస్తాయికొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూనేచలనచిత్ర రూపకర్తలు ప్రపంచ మార్కెట్లనుప్రేక్షకులను చేరుకోవడానికి అర్థవంతమైన అవకాశాలను సృష్టించడంలో ఎన్ఎఫ్‌డీసీ నిబద్ధతను ఇవి స్పష్టం చేస్తున్నాయి.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2272786   |   Visitor Counter: 21