వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర' - నూనె గింజల రైతుల కోసం భారత తొలి దేశవ్యాప్త వాట్సాప్ ఏఐ సూచనల కార్యక్రమం


అన్ని భారతీయ భాషల్లో ఉచిత, పరిశోధన ఆధారిత సలహాలు అందించనున్న 24x7 బహుభాషా చాట్‌బాట్

'ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర - ఐసీఏఆర్-ఐఐవోఆర్, దాని భాగస్వామ్య సంస్థలు అందించే... బహుభాషల, 24×7, పరిశోధన ఆధారిత సేవ'

प्रविष्टि तिथि: 11 JUN 2026 5:56PM by PIB Hyderabad

దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంవంట నూనె దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తూ దేశం ఖరీఫ్ సాగు కాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో... హైదరాబాద్‌కు చెందిన ఐసీఏఆర్-ఇండియన్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-ఐఐవోఆర్వాట్సాప్ ఆధారిత ఏఐ సూచనల కోసం 'ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర'ను అభివృద్ధి చేసిందినూనెగింజల సాగుకు సంబంధించిన విశ్వసనీయమైనపరిశోధన ఆధారిత జ్ఞానాన్ని రైతుల మొబైల్ ఫోన్లకు ఎప్పుడైనావారి సొంత భాషలో నేరుగా అందించే ఒక శక్తిమంతమైన సాధనంగా ఇది ఆవిర్భవిస్తోంది.

వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేందుకు డిజిటల్ టెక్నాలజీని వినియోగించడం పట్ల ఐసీఏఆర్ నిబద్ధతను స్పష్టం చేస్తూ... 2026 ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నూనెగింజల సదస్సులో డీఏఆర్ఈ కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా ఈ సేవను ప్రారంభించారుఈ కార్యక్రమం ద్వారాదేశంలో ఏ రకమైన నూనెగింజలు సాగు చేసే రైతులైనా... అదనపు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే... ఇప్పటికే లక్షలాది మంది రైతులకు సుపరిచితమైన వాట్సాప్ వేదిక ద్వారానే విశ్వసనీయమైనతక్షణ పంట సలహాలను ఉచితంగా పొందవచ్చు.

రైతులు +91 4024598180 నంబరును వాట్సాప్‌లో ‘ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర’గా సేవ్ చేసుకొని... వేరుశనగఆవాలునువ్వులుపొద్దుతిరుగుడుసోయాబీన్నైజర్ఇతర నూనెగింజల పంటల గురించి ఏ భారతీయ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చుఏఐ-ఆధారిత చాట్‌బాట్... వంగడాల ఎంపికపంట నిర్వహణతెగుళ్లు-వ్యాధుల నియంత్రణనీటిపారుదలపంట కోతానంతర పద్ధతులపై పరిశోధన ఆధారిత మార్గదర్శనంతో అన్ని వేళలా తక్షణం స్పందిస్తుందిఇది పూర్తిగా ఉచిత సేవ.

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఆయిల్ సీడ్స్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కెమాథుర్ మాట్లాడుతూ... ఐసీఏఆర్ సంస్థలు నూనెగింజలపై చేసిన సమష్టి పరిశోధన ద్వారాదేశంలో నూనెగింజలు సాగు చేసే ప్రతి రైతుకు వారు ఇప్పటికే ఉపయోగిస్తున్న వేదికపైవారి సొంత భాషలో పంట సంబంధిత సూచనలను అందించే తొలి వ్యవస్థ ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర’ అన్నారుఐసీఏఆర్-ఐఐఓఆర్... ఎన్‌ఎస్‌ఆర్‌ఐ... ఐఐజీఆర్... ఐఐఆర్‌ఎంఆర్... పీసీ-యూనిట్ (నువ్వులునైజర్సంస్థల శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వాట్సాప్‌లోని బహుభాషా ఏఐ ఏజెంట్‌తో అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైందని ఆయన తెలిపారుప్రయోగశాలకురైతు పొలానికి మధ్య ఉన్న దూరంభాషఖర్చు వంటి దీర్ఘకాలిక అవరోధాలను తాము తొలగించామని ఆయన తెలిపారుఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న సమయంలో నూనెగింజల రైతులుఇతర భాగస్వాములంతా ‘కిసాన్ మిత్ర’ను సేవ్ చేసుకోవడం ద్వారాఏ సమయంలోనైనా తమకు గల సందేహాలను అడిగినివృత్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్రను ఎలా సంప్రదించాలి

దశ 1: మీ ఫోన్‌లో +91 4024598180 నంబరును ‘ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర’గా సేవ్ చేసుకోండి

దశ 2: వాట్సాప్ తెరిచి, మీకు నచ్చిన భారతీయ భాషలో సందేశం పంపండి

దశ 3: మీ నూనెగింజల పంటపై పరిశోధన ఆధారిత తక్షణ సలహాను ఉచితంగా పొందండిఇది 24x7 అందుబాటులో ఉంటుంది

 

ఇది ఎలా పనిచేస్తుంది

అనేక ఐసీఏఆర్ సంస్థల సమష్టి శాస్త్రీయ నైపుణ్యంతో అభివృద్ధి చేసిన అధునాతన ఏఐ ఆధారితసమగ్ర విజ్ఞాన వ్యవస్థను ఉపయోగించి... ‘ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర’ ప్రాంతీయ భాషల్లో టైప్ చేసినపంపిన ప్రశ్నలను అర్థం చేసుకునిపంటకు అనుగుణంగా కచ్చితమైన సమాధానాలను అందిస్తుందిరైతులకు ప్రత్యేక యాప్ లేదా ఇంటర్నెట్ బ్రౌజర్ అవసరం లేదుసుపరిచితమైన వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ఉంటే సరిపోతుందిఈ చాట్‌బాట్... వంగడాల ఎంపికవ్యవసాయ పద్ధతులుతెగుళ్లు-వ్యాధుల నిర్వహణనీటిపారుదల ప్రణాళికపంట కోతానంతర మార్గదర్శనంవిత్తనాల లభ్యత సహా మొత్తం పంట చక్రాన్ని కవర్ చేస్తుంది.

దేశంలోని వివిధ వ్యవసాయ-వాతావరణ మండలాల్లోని అన్ని ప్రధాన నూనెగింజల పంటలకు సమగ్ర కవరేజీని నిర్ధారిస్తూ... ఐసీఏఆర్-నేషనల్ సోయాబీన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ఇండోర్ (ఐసీఏఆర్-ఎన్ఎస్ఆర్ఐ), ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రౌండ్‌నట్ రీసెర్చ్జునాగఢ్ (ఐసీఏఆర్-ఐఐజీఆర్), ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాప్‌సీడ్ అండ్ మస్టర్డ్ రీసెర్చ్భరత్‌పూర్ (ఐసీఏఆర్-ఐఐఆర్ఎమ్ఆర్)పీసీ-యూనిట్ (నువ్వులునైజర్)లు సమష్టిగా ఈ విజ్ఞాన వ్యవస్థను రూపొందించాయి.

 

***


(रिलीज़ आईडी: 2271844) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , हिन्दी , Gujarati , Malayalam