హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో తొలిసారిగా ఏకకాలంలో సాకారమైన పేదల సంక్షేమం, అపూర్వ అభివృద్ధి: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఈ 12 ఏళ్లలో ఒక్క రోజు కూడా విరామం లేకుండా దేశానికి, ప్రజలకు అవిశ్రాంతంగా సేవలందించిన ప్రధాని మోదీ

స్పష్టమైన సంకల్పం, దేశ ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది

प्रविष्टि तिथि: 09 JUN 2026 12:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో... సంక్షేమంమౌలిక సదుపాయాలుసామాజిక భద్రతఆర్థిక వృద్ధిలో గత 12 ఏళ్లలో భారత్ విశేష పురోగతిని సాధించిందని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: - ఇదే రోజున శ్రీ నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ మోదీ నేతృత్వంలో గడిచిన ఈ 12 ఏళ్లలో దేశంలో తొలిసారిగా పేదల సంక్షేమం, మునుపెన్నడూ లేనంత అభివృద్ధి రెండూ ఏకకాలంలో సాకారమయ్యాయి.

80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడమైనా, దేశవ్యాప్తంగా 90కి పైగా విమానాశ్రయాలనూ 140కి పైగా వందే భారత్ రైళ్లనూ ప్రారంభించడమైనా, 4 కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను నిర్మించడమైనా లేదా 1.45 లక్షల కిలోమీటర్ల రోడ్లనూ 3,000 కిలోమీటర్లకు పైగా ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ రహదారులనూ నిర్మించడమైనా, 50 కోట్ల మందికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని, అలాగే 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లను అందించడమైనా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడమైనా... ఈ 12 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా శ్రీ మోదీ దేశానికీ, ప్రజలకూ అవిశ్రాంతంగా సేవలందించారు. స్పష్టమైన సంకల్పందేశ ప్రయోజనాలే పరమావధిగా.. పూర్తి అంకితభావం నాయకులకు ఉంటేనే ఈ పరివర్తన సాధ్యమవుతుంది.” 


(रिलीज़ आईडी: 2270685) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam