ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షణ పురస్కారాల ప్రదానోత్సవం- 2026 (ఒకటో దశ)కు హాజరైన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 JUN 2026 11:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రక్షణ పురస్కారాల ప్రదానోత్సవం- 2026 (ఒకటో దశ)లో పాల్గొన్నారు. మన వీర జవానులకు శౌర్య పురస్కారాలను  ఈ కార్యక్రమంలో ప్రదానం చేశారు.
వారు  దేశ రక్షణలో కనబరిచిన అసాధారణ ధైర్య, సాహసాలు, కర్తవ్యనిష్ఠ, నిస్వార్థ సేవ గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రక్షణ పురస్కారాల ప్రదానోత్సవం- 2026 (ఒకటో దశ)లో పాలుపంచుకున్నాను. మన వీర జవానులకు శౌర్య పతకాలను  ఆ కార్యక్రమంలో ప్రదానం చేశారు. వారు  దేశ రక్షణలో కనబరిచిన అసాధారణ ధైర్య, సాహసాలను, కర్తవ్యనిష్ఠ ని, నిస్వార్థ సేవ ని చూసి మనమంతా గర్వపడుతున్నాం’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2270607) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , English , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada