హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు 2027: నామిమేషన్ల స్వీకరణకు 2026 జూలై 31 చివరి తేదీ

प्रविष्टि तिथि: 05 JUN 2026 3:44PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోయే  2027 పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు లేదా సిఫార్సుల ప్రక్రియ 2026 మార్చి 15న ప్రారంభమైంది. పద్మ అవార్డుల నామినేషన్లకు 2026 జూలై 31 చివరి తేదీ. ఈ అవార్డుల కోసం నామినేషన్లుసిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. 

పద్మ పురస్కారాలైన పద్మ విభూషణ్పద్మ భూషణ్పద్మశ్రీ అవార్డులు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలు. 1954లో ఏర్పాటైన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలుసాహిత్యంవిద్యక్రీడలువైద్యంసామాజిక సేవసైన్స్ అండ్ ఇంజనీరింగ్ప్రజా వ్యవహారాలుసివిల్ సర్వీస్వాణిజ్యంపరిశ్రమలు వంటి రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన వారినివిశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలతో సత్కరిస్తారు. జాతివృత్తిపదవిలింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అవార్డులకు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అనర్హులు. ప్రభుత్వ వైద్యులుశాస్త్రవేత్తలు మాత్రం ఇందుకు మినహాయింపు.. వీరు పద్మ అవార్డులకు అర్హులు.

 పద్మ అవార్డులను ‘‘ప్రజల పద్మ’’గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పౌరులు స్వయం నామినేషన్‌తో సహా ఇతరుల పేర్లను కూడా నామినేట్సిఫార్సు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది. మహిళలుబలహీన వర్గాలుఎస్సీలుఎస్టీలుదివ్యాంగులుసమాజానికి నిస్వార్థ సేవ అందిస్తూవారి అద్భుతమైన ప్రతిభకుసాధించిన విజయాలకు గాను నిజంగా అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక కృషి జరగాలని తెలిపింది. 

నామినేషన్లుసిఫార్సులు పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న నమూనాలో నిర్దేశించిన అన్ని వివరాలను కలిగి ఉండాలి.  అలాగే సిఫార్సు చేయబోయే వ్యక్తి సంబంధిత రంగంవిభాగంలో సాధించిన విశిష్టమైనఅసాధారణ విజయాలు లేదా సేవలను స్పష్టంగా తెలియజేయాలి. 

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://mha.gov.in ) లోని ‘అవార్డ్స్ అండ్ మెడల్స్’  శీర్షిక కింద... అలాగే పద్మ అవార్డుల పోర్టల్ (https://padmaawards.gov.in ) లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ అవార్డులకు సంబంధించిన అధికారిక నియమ నిబంధనలు https://padmaawards.gov.in/AboutAwards.aspx  లింకు ద్వారా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

***


(रिलीज़ आईडी: 2269937) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam