మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రధాన్ మంత్రీ రాష్ట్రీయ బాల్ పురస్కార్-2026’ నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ 2026 జులై 31


నామినేషన్లను రాష్ట్రీయ పురస్కార్ అధికారిక వెబ్‌సైట్ https://awards.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్లో సమర్పించవచ్చు

పీఎమ్ఆర్‌బీపీ-2026 వెబ్‌సైట్ పేజీలో నోటిఫికేషన్ ట్యాబ్ కింద ‘‘రిజిస్ట్రేషన్ అండ్ నామినేషన్ ప్రాసెస్ ఫర్ పీఎమ్ఆర్‌బీపీ’’ డాక్యుమెంట్లో అంచెలంచెలుగా విస్తృత సూచనలు లభ్యం

प्रविष्टि तिथि: 02 JUN 2026 3:51PM by PIB Hyderabad
వివిధ రంగాల్లో అసాధారణ సేవలను అందించిన బాలలకు రాష్ట్రపతి ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక గౌరవమైన ‘ప్రధాన్ మంత్రీ రాష్ట్రీయ బాల్ పురస్కారాల’కు (పీఎమ్ఆర్‌బీపీ) సంబంధించి 2026వ సంవత్సరానికి ప్రభుత్వం నామినేషన్లను స్వీకరించడం మొదలుపెట్టింది. నామినేషన్ల దాఖలుకు 2026 జులై 31 చివరి తేదీ.
నామినేషన్లను ఆన్‌లైన్ మాధ్యమంలో అధికారిక రాష్ట్రీయ పురస్కార్ వెబ్‌సైట్  https://awards.gov.in లో నుంచి మాత్రమే దాఖలు చేయాల్సివుంటుంది.
2026 జులై 31 నాటికి 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వాళ్లు మాత్రమే అర్హులు. నామినేషన్లను ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా సమర్పించవచ్చు. బాలలు తమను తాము కూడా నామినేట్ చేసుకోవచ్చు.
ఈ కింద ప్రస్తావించిన ఆరు కేటగిరీల్లో పీఎమ్ఆర్‌బీపీని ప్రదానం చేస్తారు:
       • ధైర్య, సాహసాలు
       • సామాజిక సేవ
       • పర్యావరణం
       • క్రీడలు
       • కళలు, సంస్కృతి
       • సైన్స్, టెక్నాలజీ
దరఖాస్తు చేయడానికి  https://awards.gov.in లో నమోదు చేసుకుని గాని, లేదా లాగిన్ అయ్యి గాని దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ వగైరా అతి ముఖ్య వివరాలను అందించాలి. ఆన్‌గోయింగ్ నామినేషన్స్ సెక్షనులో ‘‘ప్రధాన్ మంత్రీ రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026’’ లోకి వెళ్లి ‘‘నామినేట్, అప్లయ్ నౌ’’ను క్లిక్ చేసి సంబంధిత పురస్కార కేటగిరీని ఎంచుకొని, స్వీయ నామినేషనా లేక వేరే బాలుడు, బాలిక పేరిట దరఖాస్తు చేస్తున్నారా అనేది తెలపాలి.
దరఖాస్తులో నామినీ వివరాలు, కార్యసాధన, అది చూపిన ప్రభావం గురించిన రచన (1000 పదాల వరకూ ఉండవచ్చు), సహాయక డాక్యుమెంట్లతో పాటు, ఇటీవలి ఫోటో (జేపీజీ, లేదా జేపీఈజీ, లేదా పీఎన్‌జీ)ని కూడా అందించాలి.
పీఎమ్ఆర్‌బీపీ-2026 పోర్టల్ పేజీలో నోటిఫికేషన్ ట్యాబ్ కింద ‘‘పీఎమ్ఆర్‌బీపీకి రిజిస్ట్రేషన్, నామినేషన్ ప్రక్రియ’’ పేరుతో ఉండే డాక్యుమెంటులో క్రమంగా వివరణాత్మక సూచనలు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుల్ని తుది సమర్పణ కన్న ముందు చిత్తు ప్రతి రూపంలో సేవ్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు కూడా. దాఖలు చేసిన తరువాత, రికార్డు కోసం డౌన్‌లోడ్ చేసుకోదగిన కాపీ సిద్ధమవుతుంది.
ఈ అవార్డు జీవితపర్యంతం గుర్తుండిపోయే గౌరవం. ఇది యువ ప్రతిభావంతులను జాతీయ వేదికపైకి తీసుకువస్తుంది. వివరణాత్మక మార్గదర్శక సూత్రాలు, ఇదివరకటి విజేతల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కింది లింకులలోకి వెళ్లండి:
       • నామినేషన్ సమర్పణకు ఉద్దేశించిన వెబ్‌సైట్: https://awards.gov.in
       • మునుపటి పురస్కార గ్రహీతలకు సంబంధించిన సమాచారం: https://awards.gov.in/Awardee
అర్హత కల బాల బాలికలు ఈ గౌరవాన్ని పొందడానికి దరఖాస్తు చేయడానికి లేదా నామినేట్ కావడానికీ వారికి సాయపడాల్సిందిగా అందరు తల్లితండ్రులకీ, ఉపాధ్యాయులకీ, సంస్థలకీ, పౌరులకీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
సంబంధిత పీఐబీ విజ్ఞప్తి లింకును ఈ కింద చూడవచ్చును:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255800&reg=3&lang=2

 
***

(रिलीज़ आईडी: 2268028) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam