చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానానికి అయిదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

प्रविष्टि तिथि: 01 JUN 2026 9:31AM by PIB Hyderabad

రాజ్యాంగ 124వ అధికరణం 2వ క్లాజు అందిస్తున్న అధికారాలను వినియోగించుకుంటూఈ కింద పేర్కొన్న వ్యక్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము నియమించారుదీనికి సంబంధించి 2026 జూన్ 1వ తేదీతో.. అదే సంఖ్యతో కూడిన నోటిఫికేషన్లను జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శ్రీ జగన్నాథన్ శ్రీనివాసన్ తెలిపారు

కొత్త జడ్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
1. 
శ్రీ జస్టిస్ శీల్ నాగు.. ఈయన పంజాబ్ హర్యానా ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
2. 
శ్రీ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్.. ఈయన బాంబే ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
3. 
శ్రీ జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా.. ఈయన మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
4. 
శ్రీ జస్టిస్ అరుణ్ పల్లి.. ఈయన జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
5. 
శ్రీమతి వెంకిట సుబ్రమణి మోహన.. ఈమె సీనియర్ న్యాయవాది.
సర్వోన్నత న్యాయస్థానం నూతన న్యాయమూర్తుల నియామకాలు వారు పదవీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయి.  

***


(रिलीज़ आईडी: 2267424) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam