రాష్ట్రపతి సచివాలయం
ఈద్-ఉల్-జుహా పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 6:39PM by PIB Hyderabad
ఈద్-ఉల్-జుహా పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పంపిన సందేశంలో- “ఈద్-ఉల్-జుహా పర్వదినం నేపథ్యంలో దేశవిదేశాల్లో నివసించే భారతీయులందరికీ... ముఖ్యంగా మన ముస్లిం సోదరీసోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను...
భక్తి, త్యాగం, నిష్కామ సేవలకు ఈ పర్వదినం ఒక ప్రతీక. మానవాళికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు సేవ దిశగా మనను ఉత్తేజితం చేస్తుంది.
ఈ శుభ సందర్భాన.. సమాజంలో ప్రేమ, సామరస్యాన్ని ఇనుమడించేందుకు కృషి చేయాలన్న మన సంకల్పాన్ని మరింత దృఢంగా పురుద్ఘాటిద్దాం” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2266289)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam