పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎన్‌జీ కనెక్షన్లను ఎంచుకొనే వినియోగదారుల సౌలభ్యం కోసం సవరించిన ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వును జారీ చేసిన ప్రభుత్వం


పీఎన్జీ సదుపాయం లేని ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్‌ను పునరుద్ధరించుకొనేలా ట్రాన్స్‌ఫర్ ఓచరు పొందే అవకాశం

प्रविष्टि तिथि: 25 MAY 2026 6:31PM by PIB Hyderabad

ద్రవీకరించిన పెట్రోలియం గ్యాసు (సరఫరాపంపిణీ నియంత్రణసవరణ ఉత్తర్వు – 2026 ను భారత్ ప్రభుత్వం 2026 మే 25న నోటిఫై చేసిందిపైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను ఎంచుకున్న గృహ ఎల్పీజీ వినియోగదారులకు అదనపు సడలింపుసౌకర్యాన్ని కల్పించడమే ఈ సవరణ లక్ష్యం.

·         సవరించిన నిబంధనల ప్రకారం పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న ఎల్పీజీ వినియోగదారులు దిగువ పేర్కొన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

o    పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్‌ రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చులేదా

o    భవిష్యత్తులో పీఎన్జీ సదుపాయం లేని ప్రాంతాలకు నివాసం మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి పొందడానికి వీలుగా ట్రాన్స్‌ఫర్ ఓచరును వినియోగదారులు తీసుకోవచ్చు.

·         పీఎన్జీ మౌలిక వసతులు సాధ్యం కాని ప్రాంతాల్లో స్థిరపడే వినియోగదారులకు ఉపశమనాన్నీసౌలభ్యాన్నీ ఈ సవరణ అందిస్తుంది.

·          ఈ నిబంధన బదిలీ అయ్యే ఉద్యోగులకూవలస కుటుంబాలకూఅద్దెకు ఉండేవారికీవిద్యార్థులకూపీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు నివాసం మారే కుటుంబాలకూ లబ్ధి చేకూరుస్తుంది.

***


(रिलीज़ आईडी: 2265229) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam