ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షలపై మంత్రుల స్థాయి దృష్టి కోణాలు’’ అనే అంశంపై జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79వ సమావేశం.. పాల్గొన్న కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2026 9:18AM by PIB Hyderabad

వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79వ సమావేశాన్ని జెనీవాలో నిర్వహించారుదీనిలో భాగంగా ‘‘ఊపిరితిత్తుల పరీక్షలపై మంత్రుల స్థాయి దృష్టికోణాలు’’పై ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ప్రసంగించారు. ‘‘మీ ఆరోగ్య వ్యవస్థ ఊపిరితిత్తుల పరీక్షలో సవాళ్లను ఎదుర్కొంటోందా?’’ శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ‘స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్’ ఏర్పాటు చేయగా భారత్జపాన్ఫిలిప్పీన్స్జాంబియాలు సహ నిర్వాహకుల పాత్రను పోషించాయి.

కార్యక్రమానికి ఆహ్వానించిన వారిని ఉద్దేశించి శ్రీ నడ్డా ప్రసంగిస్తూ.. సకాలంలో పరీక్ష చేయించుకోవడంతొలి దశలోనే రోగనిర్ధారణఅందరికీ ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యత.. ఇవి సుదృఢప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చే ఆరోగ్య వ్యవస్థలకు కీలకమన్నారుఊపిరితిత్తుల ఆరోగ్యపరీక్షల్ని బలోపేతం చేయడం ఒక్క సాంకేతికతరోగినిర్ధారణ పరికరాలకే పరిమితమైన విషయం కాదనీఅది.. ప్రాణాలను కాపాడేబాధను తగ్గించేఆరోగ్యరక్షణలో భారీ ఖర్చుల్ని నివారించేఉపాధిని రక్షించేఆరోగ్యసంరక్షణ వ్యవస్థల్ని పటిష్ఠపరచడంతో ముడిపడి ఉంటుందని ఆయన వివరించారు.

క్షయను నిర్మూలించే అంశంలో భారత్ నిబద్ధతతో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ‘‘జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, ‘‘టీబీ-ముక్త్ భారత్’’ దార్శనికతలలో భాగంగా ప్రపంచంలో అత్యంత భారీ స్థాయి పరీక్షల నిర్వహణ ప్రక్రియనీవ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించే ప్రయత్నాల్ని భారత్ చేపట్టిందని ఆయన తెలిపారుఇంటింటికీ వెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్యమంసంచార పరీక్షల బృందాల్ని రంగంలోకి దింపడంసాముదాయిక ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటువ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలూవర్గాల నడుమ లక్షిత కార్యక్రమాల్ని చేపట్టి యాక్టివ్ కేసుల్ని గుర్తించే ప్రక్రియను కూడా భారత్ అనుసరిస్తోందని శ్రీ నడ్డా చెప్పారు.

 

క్షయవ్యాధినీఊపిరితిత్తులకు సోకే ఇతర వ్యాధుల్నీ గుర్తించడానికి భారత్ ఆధునిక రోగనిర్ధారణ వ్యవస్థలను గణనీయంగా విస్తరించిందని శ్రీ నడ్డా వెల్లడించారుమాలిక్యూలార్ టెస్టింగ్ ప్లాట్‌ఫారాలూడిజిటల్ ఛాతీ ఎక్స్-రే సేవలూకృత్రిమ మేధ (ఏఐసహాయంతో పని చేసే పరికరాలూచేతిలో పట్టుకోదగ్గ పరికరాలూపలు చోట్ల నెలకొల్పిన పరీక్షా వ్యవస్థలను వినియోగించుకుంటున్నట్లు ఆయన వివరించారునూతన ఆవిష్కరణలు అందరికీ సమానంగా ఉపయోగపడాలనీసాంకేతికత సమాజంలో చివరి వ్యక్తి చెంతకు కూడా చేరుకోవాలనీ ఆయన స్పష్టం చేశారు.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో భాగంగా ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ సంబంధిత సంస్కరణలతో పాటు ముందు వరుసలో నిలిచి పనిచేసే సిబ్బంది కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. ఇది జరిగితేనే ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతాయని ఆయన అన్నారురోగనిర్ధారణ చేసినంత మాత్రాననే సరిపోదనీపోషకాహార సంబంధిత సహకారంచికిత్స నియమాల పాలనపరమైన సహాయాన్ని కూడా అందజేయడంసామాజిక భద్రతతోటివారి మద్దతు లభించడం.. ఇవన్నీ ముఖ్యేనని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకూవారి కుటుంబాలకూ సాయపడటానికి పౌరులుసంస్థలుకార్పొరేట్లుసముదాయాలను భారత్ ఏకతాటి మీదకు తెచ్చింది’’ అని ఆయన తెలిపారు.

భారత్ అమలుచేస్తున్న డిజిటల్ కార్యక్రమాల్ని శ్రీ నడ్డా ప్రస్తావిస్తూ, ఏఐ-ఆధారిత బహుభాషా చాట్‌బాట్‌ ‘ఖుషీ’ ఒక భాగంగా ఉన్న ‘టీబీ ముక్త్ భారత్ యాప్‌’ను తీసుకువచ్చామన్నారుదీనిని ఆరంభ స్థాయి స్మార్ట్‌ఫోన్లలోనూ తేలికగా ఉపయోగించవచ్చన్నారుఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వ్యాధి లక్షణాలుహక్కులుఅతి సమీపంలో ఉన్న రోగనిర్ధారణ కేంద్రాల సమాచారాన్ని వాస్తవ కాల (రియల్-టైంప్రాతిపదికన అందిస్తుందనీవ్యాధి లక్షణాలు మొదలైన తరువాత చికిత్సను ఆరంభించడానికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది తోడ్పడుతుందనీ ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బలమైన సహకారం అవసరమంటూ శ్రీ నడ్డా పిలుపునిచ్చారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కొన్ని కీలక అంతర్జాతీయ ప్రాధాన్యాల్ని ఆయన ప్రతిపాదించారుఈ ప్రతిపాదనల్లో.. అందరికీ ఆరోగ్య సేవల విస్తరణ ప్రణాళికల్లో ‘ఊపిరితిత్తుల స్వస్థత’ అంశాన్ని కూడా చేర్చడంతక్కువ ఖర్చులో రోగనిర్ధారణ సేవలుడిజిటల్ పరికరాలుపరీక్షాసంబంధిత సాంకేతికతల పరిధిని విస్తరించడంశ్వాసకోశ స్వస్థతను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ వ్యవస్థల్ని పటిష్ఠపరచడంనూతన ఆవిష్కరణల్నీదేశీయ తయారీ విధానాల్నీసాంకేతికత బదలాయింపునీ ప్రోత్సహించడంటీబీతో పాటు శ్వాసకోశానికి వచ్చే ఇతర వ్యాధులను కూడా ప్రారంభ దశలోనే గుర్తించడానికీఆ వ్యాధుల్ని నివారించడానికీ నిరంతర ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావడం వంటివి భాగంగా ఉన్నాయి.

ప్రపంచ నిర్దేశిత లక్ష్యాల కన్నా ముందగానే క్షయవ్యాధిని సమాప్తం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి పునరుద్ఘాటించారు. దృఢతర ఆరోగ్య వ్యవస్థలుమెరుగైన రోగనిర్ధారణ ప్రక్రియలుస్వచ్ఛ పరిసరాలుపోషణకు సంబంధించిన చైతన్యాన్ని పెంపొందింప చేయడంఅందరికీ సమాన ఆరోగ్య సంరక్షణానుకూల అవకాశాల కల్పన వంటి ప్రణాళికలను అమలుపరిస్తే టీబీకి వ్యతిరేకంగా జరిపే పోరాటం సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారువ్యాధి ముదిరిపోయాక గాని రోగనిర్ధారణని పూర్తి చేయని స్థితి నుంచి వ్యాధిని ప్రారంభిక దశలోనే గుర్తించే పద్ధతులకు మారాలనీఅరకొర పద్ధతిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు బదులు ఏకీకృత సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు దిశగా పురోగమించాలనీరోగ నియంత్రణ వైఖరిని వీడి ఆరోగ్య పరిరక్షక వ్యవస్థను నిర్మించడానికి మొగ్గు చూపాలనీ ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య పరీక్షలకు ఆచరణీయవిస్తృత స్థాయి పరిష్కారాల్ని కనుగొనడంలో ప్రభుత్వాలునూతన ఆవిష్కర్తలుఅభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకొనే వర్గాలుసముదాయాలతో కలిసి ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటిస్తూ శ్రీ నడ్డా ప్రసంగాన్ని ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2264157) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada , Malayalam