ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 60,000 కేజీల పోక చెక్కలను ఈశాన్య ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ: అయిదుగురి అరెస్టు

प्रविष्टि तिथि: 22 MAY 2026 1:43PM by PIB Hyderabad

నిన్నఈ వారం ప్రారంభంలో ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన రెండు ప్రధాన ఆపరేషన్లలో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న సుమారుగా 60,000 కేజీల పోక చెక్కల (వక్క)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐగువాహటి జోనల్ యూనిట్ స్వాధీనం చేసుకుంది.

image.png

కచ్చితమైన సమాచారం ఆధారంగా మిజోరాంఅస్సాంలో డీఆర్ఐ దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకుందిమయన్మార్-మిజోరాం సరిహద్దుల ద్వారా విదేశాల్లో పండించే ఎండ బెట్టిన పోక చెక్కలను భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందిఒక ఆపరేషన్లో డీఆర్ఐకు అస్సాం రైఫిల్స్ 38 బెటాలియన్ సహకారం అందించిందిఈ దాడుల్లో ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్టు చేశారు.

పొరుగు దేశం నుంచి సాగిస్తున్న పోక చెక్కలను అక్రమంగా రవాణా.. దేశీయంగా వాటిని పండిస్తున్న రైతులకు తీవ్ర ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తోందిసరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోంది.

****


(रिलीज़ आईडी: 2264153) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Manipuri , Khasi , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil