ఉప రాష్ట్రపతి సచివాలయం
కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బి.సి. ఖండూరికి డెహ్రాడూన్‌లో నివాళి అర్పించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 11:27AM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బి. సి. ఖండూరీకి డెహ్రాడూన్‌లోని ఆయన నివాసంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఈ రోజు వినమ్ర పూర్వక నివాళి అర్పించారు.
దివంగత నేతకు నివాళి అర్పిస్తూ.. దేశ సేవకూ, ప్రజా సేవకూ జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ నాయకుడిగా, అవిశ్రాంత సైనికుడిగా, పరిపాలన దక్షుడిగా మేజర్ జనరల్ ఖండూరి చిరస్మరణీయులుగా నిలుస్తారని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
అనుసంధానాన్ని మెరుగుపరచడంలో, దేశ రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో మేజర్ జనరల్ ఖండూరి కృషి.. దేశ అభివృద్ధి ప్రస్థానంలో చిరస్థాయిలో నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2263283)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18