ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బి. సి. ఖండూరి (విశ్రాంత) మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

प्रविष्टि तिथि: 19 MAY 2026 2:16PM by PIB Hyderabad

కేంద్ర మాజీ మంత్రిఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బిసిఖండూరి (విశ్రాంతమృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపిరాధాకృష్ణన్ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మేజర్ జనరల్ ఖండూరి మరణంతో.. ఓ గొప్ప సైనికుడినిసమర్థుడైన పాలకుడినిఅరుదైన నిజాయితీపరుడైన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

స్వర్ణ చతుర్భుజిజాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా దేశ రహదారి మౌలిక సదుపాయాల రూపురేఖలను మార్చడంలో మేజర్ జనరల్ ఖండూరి దార్శనిక కృషి దేశ అభివృద్ధి ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

డెహ్రాడూన్ పర్యటన సందర్భంగా దివంగత నాయకుడితో ఇటీవల తాను సమావేశమయ్యానని చెబుతూ.. లోక్‌సభలో మాజీ సహచరులుగా తమ అనుబంధాన్ని ఆప్యాయంగా గుర్తుచేసుకున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.

ఈ విషాద సమయంలో ఖండూరి కుటుంబానికిఆయన అసంఖ్యాక అభిమానులకుఉత్తరాఖండ్ ప్రజలకు ఉపరాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

***


(रिलीज़ आईडी: 2262768) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam