ప్రధాన మంత్రి కార్యాలయం
నార్వే ఐదవ రాజు హరాల్డ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 7:36PM by PIB Hyderabad
నార్వే లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఓస్లోలోని రాయల్ ప్యాలెస్‌లో నార్వే ఐదో రాజు కింగ్ హెరాల్డ్ తో అధికారికంగా సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా భారత ప్రజల తరఫున శుభాకాంక్షలను, శుభాభినందనలను తెలియజేశారు. నార్వే దేశ ప్రకృతి సౌందర్యాన్ని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజా ప్రాధాన్య పరిపాలన వంటి ఉమ్మడి విలువల పునాదిపై భారత్ - నార్వేల మధ్య సుదీర్ఘ స్నేహబంధం మరింత బలోపేతం అవుతూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
వివిధ రంగాలలో, ముఖ్యంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాలలో భారత, నార్వే కంపెనీలు సాధించిన అద్భుతమైన పురోగతిని గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ, నార్వే రాజు హరాల్డ్ చర్చించారు.
ఈ సమావేశం అనంతరం, ప్రధానమంత్రి శ్రీ మోదీ గౌరవార్థం నార్వే రాజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
తమకు అందించిన సాదర ఆతిథ్యానికి గాను నార్వే రాజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
(రిలీజ్ ఐడి: 2262639)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada