ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్

నాడు పోస్టు చేయడమైనది: 16 MAY 2026 10:30PM by PIB Hyderabad

గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్‌ సమక్షంలో సంతకాలు చేశాయి. 

భారతదేశపు మొట్టమొదటి ఫ్రంట్-ఎండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ కోసం టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్ భాగస్వామ్యం కావడాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారత్ ప్రయాణంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.

ఏఎస్ఎంఎల్ ఒక డచ్ బహుళజాతి సంస్థ. సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన హై-ప్రిసిషన్ లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడంలో ఇది ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. టాటా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం గుజరాత్‌లో ఒక సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

ప్రముఖ డచ్ సీఈఓలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ఇక్కడ [Link] వీక్షించొచ్చు.

***


(రిలీజ్ ఐడి: 2262038) సందర్శకుల సూచీ సంఖ్య : : 69