ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని యూఏఈ పర్యటన: కుదిరిన ఒప్పందాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 3:46PM by PIB Hyderabad

 

క్ర.సం.

అవగాహన ఒప్పందం/ఒప్పందం

ముఖ్యాంశాలు

1.

భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల లిమిటెడ్ (ఐఎస్పీఆర్ఎల్), అబుదాబి జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్‌వోసీ) మధ్య వ్యూహాత్మక సహకారంపై అవగాహన ఒప్పందం

(a) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న నిల్వ కేంద్రాల్లో భాగస్వామ్యం, ఒడిశాలోని చండికోల్‌లో నిల్వ కేంద్రాల అభివృద్ధి ద్వారా.. భారత వ్యూహాత్మక చమురు నిల్వల్లో దాదాపు 30 మిలియన్ బారెళ్ల వరకు ఏడీఎన్‌వోసీ ముడి చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది.

(b) భారత వ్యూహాత్మక చమురు నిల్వలో భాగంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరాలో ముడి చమురును నిల్వ చేసే అవకాశముంది.

(c) భారత్‌లోని లిక్విడ్ నేచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ నిల్వ కేంద్రాల ఏర్పాటులో పరస్పర సహకారానికి అవకాశాలు.

2.

లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐవోసీఎల్) కంపెనీ, అబుదాబి జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్‌వోసీ) మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం

ఎల్పీజీ అమ్మకం, కొనుగోలులో అవకాశాలను అన్వేషించడం. ఇందులో భాగంగా ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఏడీఎన్‌వోసీ గ్యాస్ లిమిటెడ్, ఐవోసీఎల్ మధ్య దీర్ఘకాలిక విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వంటి అంశాలున్నాయి.

3.

వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య విధానం

రక్షణ పారిశ్రామిక సహకారం, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికత, శిక్షణ, సైనిక విన్యాసాలు, విద్య - సిద్ధాంతం, ప్రత్యేక కార్యకలాపాలు - పరస్పర కార్యాచరణ, నౌకావాణిజ్య భద్రత, సైబర్ రక్షణ, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, సమాచార వినిమయం కోసం వ్యూహాత్మక వ్యవస్థ.

4.

వడినార్‌లో నౌకా మరమ్మతుల క్లస్టర్ ఏర్పాటు కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్), డ్రైడాక్స్ వరల్డ్ (డీడీడబ్ల్యూ) మధ్య అవగాహన ఒప్పందం

 

భారత ప్రభుత్వం ప్రారంభించిన నౌకావాణిజ్య అభివృద్ధి నిధి పథకం కింద.. గుజరాత్‌లోని వడినార్ వద్ద నౌకల మరమ్మతు కేంద్రం, సముద్ర తీరంలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు సహకారం.

5.

నౌకల మరమ్మతు రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్), డ్రైడాక్స్ వరల్డ్ (డీడీడబ్ల్యూ), నౌకావాణిజ్య, నౌకా నిర్మాణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఎంఎస్) మధ్య అవగాహన ఒప్పందం.

నౌకావాణిజ్యంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి సమీకరణ, వారికి శిక్షణతోపాటు ఉపాధిని కల్పించే వ్యవస్థను ఈ త్రైపాక్షిక ఒప్పందం నెలకొల్పుతుంది. భారతీయ నౌకావాణిజ్య శ్రామిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, నౌకల తయారీ, మరమ్మతు నిపుణులకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం.

6.

భారత్‌కు చెందిన సీ-డాక్, యూఏఈకి చెందిన జి-42 సంస్థల భాగస్వామ్యంలో 8 ఎక్సాఫ్లాప్ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ ఏర్పాటుపై నిబంధనల పత్రం  

భారత ఏఐ మిషన్‌లో భాగంగా.. సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ ఏర్పాటు కోసం సీ-డాక్, జి-42 సంస్థల మధ్య సహకారానికి మార్గం సుగమం చేయడం.

ప్రకటన

7.

యూఏఈ నుంచి భారత్‌కు పెట్టుబడులు

(i) భారత మౌలిక సదుపాయాల రంగంలో 1 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల కోసం అబుదాబి పెట్టుబడుల ప్రాధికార సంస్థ (ఏడీఐఏ), భారత జాతీయ మౌలిక సదుపాయాలు, పెట్టుబడి నిధి (ఎన్ఐఐఎఫ్) కలిసి పనిచేయనున్నాయి.

(ii) భారత ఆర్‌బీఎల్ బ్యాంకులో ఎమిరేట్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఈఎన్‌బీడీ) 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది

(iii)  భారత్‌లోని సమ్మాన్ క్యాపిటల్‌లో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.

 

****

  


(రిలీజ్ ఐడి: 2261595) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam