ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


సమూల మార్పులు, శాశ్వత ఫలితాల కోసం సమాజం, ప్రభుత్వం సమష్టిగా పనిచేయడం అవసరం... క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా విద్యారంగంలోని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి... జాతీయ విద్యావిధానం దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ: ప్రధాని

చిన్న పట్టణాల్లోనే ఆవిర్భవిస్తున్న ప్రధాన అంకుర సంస్థలు... స్టార్టప్‌ల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం... ఒకప్పుడు ప్రమాదకరమైనవిగా భావించిన రంగాలను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్న యువత: పీఎం


కొవిడ్-19 ఈ శతాబ్దంలో అతి పెద్ద సంక్షోభమైతే.. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభం, మహమ్మారిని సమష్టిగా ఎలా ఎదుర్కొన్నామో, ఈ అనిశ్చితిని కూడా అలాగే అధిగమిస్తాం: పీఎం


పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ ప్రభావం మన పౌరులపై అతి తక్కువగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: పీఎం



భారతీయ పౌరులుగా మన విధులకు మనం ప్రాధాన్యమివ్వాలి, గడచిన దశాబ్దాల్లో యుద్ధాలు లేదా ఇతర సంక్షోభాలను దేశం ఎదుర్కొన్నప్పుడు.. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి పౌరుడూ తమ బాధ్యతలను నెరవేర్చడానికి ముందుకొచ్చారు, ఇప్పుడు మరోసారి మన బాధ్యతలు సమష్టిగా నిర్వర్తించి, దేశ వనరులపై పడిన భారాన్ని తగ్గించాల్సిన అవసరం మరోసారి ఏర్పడింది: ప్రధాని

మన ప్రయత్నాల ద్వారా దిగుమతుల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి, విదేశీ మారక నిల్వలను తగ్గించే వ్యక్తిగత కార్యకలాపాలను కూడా నివారించాలి:పీఎం


‘ఓకల్ ఫర్ లోకల్’ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది, విదేశీ వస్తువులకు బదులుగా స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలి, మన గ్రామాలు, నగరాలు, దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయాలి: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 9:53PM by PIB Hyderabad

గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారువడోదరలోని సర్దార్‌ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారుసోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవంఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారుడాక్టర్ దుష్యంత్దక్ష్ పటేల్ భవన సముదాయాన్నిబోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారువివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారువీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమేప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నానుఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాంచారిత్రక వారసత్వంప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.

భారత దేశంలో సర్దార్ ధామ్ విద్యాసంస్థ విస్తరిస్తున్న తీరును వివరిస్తూ... ఆ సంస్థ 75 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. 2021లో జరిగిన బాలికల వసతి గృహం శంకుస్థాపనకు వచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్నారుసూరత్రాజ్‌కోట్భుజ్మెహసానాఢిల్లీల్లోనూ ఈ సంస్థ ఉందన్నారుఅహ్మదాబాద్‌లోని నికోల్‌ వద్ద వెయ్యి మందికి వసతి కల్పించే బాలికల హాస్టల్‌‌ ప్రారంభోత్సవం పట్ల సంతోషం వ్యక్తం చేశారుఅలాగే కొత్తగా వచ్చిన మార్పుల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘గతేడాది ప్రారంభమైనప్పటి నుంచీ ఈ వసతి గృహంలో వేలాది మంది అమ్మాయిలు చదువుకుంటున్నారుతమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారుఈ రోజు శంకుస్థాపన చేసిన వసతి గృహం కూడా దేశంలో బాలికలకు విద్యను అందిచడంలో సర్దార్ ధామ్ కనబరుస్తున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది‌‌’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

విద్యారంగంలో మార్పులను సామాజిక పరిణామం అనే విస్తృత కోణంలో చూపిస్తూ... సంస్కరణలను వాస్తవ అనుభవాలకు తగినట్లుగా చేపట్టాలని ప్రధానమంత్రి అన్నారుసమగ్ర మార్పు సాధించేందుకు ప్రభుత్వంసమాజం మధ్య సహకారాత్మక ప్రయత్నం అవసరమని తెలిపారువ్యవస్థాగత మార్పులను తీసుకొచ్చే సాక్ష్యం ఆధారిత విధానానికి జాతీయ విద్యా విధానం ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారుభాషా పరమైన వివక్షను తొలగించడం నుంచి పాఠ్యాంశాల్లో నైపుణ్యాభివృద్ధినిఆవిష్కరణలను భాగం చేయడం వరకూ ఈ విధానంలోని అనేక నూతనాంశాల గురించి వివరించారు. ‘‘సమూలమైన మార్పులుశాశ్వత ఫలితాల కోసం సమాజంప్రభుత్వం సమష్టిగా పనిచేయడం అవసరంఅప్రెంటిస్ షిప్ అవకాశాలతో యువత డిగ్రీలను పూర్తి చేయాలిఫలితంగా పట్టభద్రులైన అనంతరం గందరగోళానికి గురి కాకుండా ఉంటారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.

విద్యారంగంలో పెట్టుబడుల వల్ల కలిగే విస్తృత ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి వివరించారువిశిష్టమైన గుజరాత్ పారిశ్రామిక సంస్కృతిని ప్రశంసించారుఈ రాష్ట్ర యువతకు సహజసిద్ధంగా ఉన్న వ్యాపార నైపుణ్యాన్ని స్టార్టప్ ఇండియా మిషన్ విధానాల ద్వారా మరింత ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారుచిన్న నగరాల్లో అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో ఇటీవలి కాలంలో వచ్చిన పెరుగుదలనుఔత్సాహిక పారిశ్రామిక రంగంలో వేగంగా పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం గురించి వివరించారుగతంలో ప్రమాదకరమైనవిగా భావించిన రంగాలు ఇప్పుడు యువ ఆవిష్కర్తలను ఆకర్షిస్తున్నాయన్నారు. "భవిష్యత్తులో విస్తృత స్థాయిలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి దేశంలో ఉంటుందిదీనివల్ల దేశంలో తయారీ రంగం అపూర్వమైన వేగాన్ని సాధిస్తుందిగడచిన దశాబ్దంలో క్రీడల నుంచి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వరకు సాధించిన అభివృద్ధి దీనికి నిదర్శనం’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.

మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని నాగరికత పురోగతికి ప్రాథమిక కొలమానంగా ప్రధానమంత్రి గుర్తించారుఈ విషయాన్ని రెండు దశాబ్దాల క్రితమే గుజరాత్ గుర్తించిందని చెప్పారుఅలాగే ఆ రాష్ట్రం అనుసరిస్తున్న స్త్రీ పురుష – సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని వివరించారుఈ నమూనాను జాతీయ స్థాయిలో అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్యంనీరుఇంధన సదుపాయాల కల్పనతో పాటుగా కోట్లాది మంది మహిళలకు బ్యాంకు ఖాతాలను అందించామన్నారుముద్ర పథకం అందించిన సాధికారతఆయుష్మాన్ భారత్ అందించిన భద్రత గురించి కూడా వివరించారు. ‘‘మహిళల భాగస్వామ్యంపైనే సమాజం ప్రగతి ప్రాథమికంగా ఆధారపడి ఉందని గుజరాత్ అర్థం చేసుకుందిదానికి తగినట్లుగా బలమైన చర్యలు చేపట్టిందిదాని ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుతున్నాయి’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.

చరిత్రాత్మకంగా పురుషాధిక్యత అధికంగా ఉన్న రంగాల్లో మహిళా శ్రామిక శక్తిని ఏకీకృతం చేయడం గురించి ప్రధానమంత్రి వివరించారుగతంలో తమకు అందనంత దూరంలో ఉన్న నాయకత్వ పాత్రల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారుసైనికవిమానయానరాజకీయ రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులను అంగీకరించారుపార్లమెంటులో నారీశక్తి వందన్ సవరణను ఆమోదం పొందడానికి చేసిన విఫల యత్నాలను ఉటంకించారురాజకీయంగా అడ్డంకులున్నాయని అంగీకరిస్తూనే.. స్త్రీపురుష సమానత్వ లక్ష్యాల పట్ల తమకున్న అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళా క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారుమన అమ్మాయిలు ఫైటర్ పైలట్లుగా మారుతున్నారురాజకీయాల్లోనూ మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిసవరణ ఆమోదానికి రాజకీయ కారణాలు అడ్డుపడినప్పటికీమా చిత్తశుద్ధి చెదిరిపోదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

స్త్రీపురుష సమానత్వంతో కూడిన అవకాశాలను విస్తరించే బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే కాకుండా పౌర సమాజ సంస్థలకు కూడా ఉందని చెబుతూ.. సంస్థాగత ఆచరణకు ఉదాహరణగా సర్దార్ ధామ్ అంకితభావాన్ని ప్రధానమంత్రి ఉదహరించారువివిధ రంగాల్లో మహిళా సాధికారతను సాధించేందుకు ఈ సంస్థ చేపడుతున్న సమగ్ర ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. సంస్థాగత గుర్తింపును అందించారు. ‘‘సర్దార్ ధామ్ ఈ బాధ్యతను పూర్తి అంకితభావంతో చేపట్టిసామాజిక అభివృద్ధికి సంస్థాగత నిబద్ధతను కొనసాగించడం అవసరమని తన చర్యల ద్వారా నిరూపిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

మారుతున్న కాలం దిశను వేగంగా గుర్తించడమే గుజరాత్‌కున్న విశిష్ట సాంస్కృతిక లక్షణమని ప్రధానమంత్రి అన్నారుఅలాగే ఆటంకాలను అవకాశాలుగా మార్చుకొనే సంస్థాగత సామర్థ్యమే ఆ రాష్ట్రానికున్న బలమైన పోటీతత్వానికి కారణమని తెలియజేశారుఈ నేపథ్యంలో తయారీరంగంలో వస్తున్న సమకాలీన మార్పులను చారిత్రక పరిణామక్రమంలో భాగంగా పేర్కొన్నారుసెమీకండక్టర్లుఏరోస్పేస్అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్హరిత విద్యుత్ఆర్థిక సేవలతో సహా వైవిధ్యమైన ఆధునిక రంగాల్లో రాష్ట్రం సాధించిన సంస్థాగత సామర్థ్యాన్ని వివరించారు. ‘‘మార్పును అవకాశంగా మలుచుకోవడంనూతన అవకాశాలను స్వీకరించడంభవిష్యత్తుకు తగినట్టుగా సిద్ధమవడం గుజరాత్ పని సంస్కృతిలో భాగందీని ఫలితంగానే నూతనంగా ఆవిర్భవిస్తున్న ప్రతి రంగంలోనూ రాష్ట్రం కొత్త గుర్తింపును సృష్టించుకుంటోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.

దేశీయంగా సెమీకండక్టర్ ఉత్పత్తి సామర్థ్యం గురించి వివరిస్తూ... ఆధునిక తయారీ రంగ పరివర్తనను కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిగా ప్రధానమంత్రి వర్ణించారుకైన్స్ సెమీకండక్టర్ ప్లాంటులో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం కావడంతో సనంద్‌లో మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్లు తయారవుతున్నాయన్నారుధోలెరాసూరత్‌లో పురోగతిలో ఉన్న కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టు వివరాలను తెలియజేస్తూసరఫరా వ్యవస్థల కేంద్రీకరణ అంశంలో జాతీయ ఆకాంక్షను వ్యక్తం చేశారుఅలాగే అంతర్జాతీయ నెట్‌వర్క్‌లలో ప్రాంతీయ కేంద్రాలను గుర్తించారు. ‘‘అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా గుజరాత్ తనని తాను మలుచుకుంటోందిఈ పరివర్తనలో వడోదర కీలక పాత్ర పోషిస్తోందిఎందుకంటే ఇక్కడి నుంచి మెట్రో కోచ్‌లు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.

వివిధ రంగాల్లో వడోదరకున్న తయారీ నైపుణ్యం గురించి వివరిస్తూ... ఇంజినీరింగ్భారీ యంత్రాలురసాయనాలుఫార్మాసూటికల్స్విద్యుత్ సామగ్రికి ఈ నగరం బలమైన కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి చెప్పారుఅదే సమయంలో వృత్తిపరమైన అభివృద్ధి మౌలిక వసతుల గురించి కూడా చర్చించారుగతిశక్తి విశ్వ విద్యాలయం ద్వారా రవాణాలాజిస్టిక్స్ నిపుణులకు ఇచ్చే శిక్షణఏరోస్పేస్ ప్రాజెక్టులు వడోదరను విమానయాన తయారీ కేంద్రంగా ఆవిర్భవించేందుకు సహకరిస్తున్నాయని అంగీకరించారుఅలాగే సమగ్ర ఆర్థిక మార్పుల గురించి వివరించారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్ సామర్థ్యాలతో విభిన్న రంగాల్లో తయారీ కేంద్రంగా వడోదర రూపాంతరం చెందిందిఇది అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విమానయాన కేంద్రంగా ఈ నగరం ఎదుగుతుందని సూచిస్తోంది’’ అని మోదీ తెలియజేశారు.

పలు సంక్షోభాల వల్ల తలెత్తిన అస్థిరతను ప్రధానమంత్రి గుర్తించారుచరిత్రలో ఎదురైన అనిశ్చిత పరిస్థితులతో ప్రస్తుత సవాళ్లను పోలుస్తూ.. కరోనా మహమ్మారిఆర్థిక అస్థిరతపశ్చిమాసియా ఘర్షణలను కొనసాగుతున్న ఒత్తిడికి కారణాలని చెప్పారుఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభంగా పశ్చిమాసియా సంఘర్షణను వర్ణించారుమహ్మారి సమయంలో ప్రదర్శించిన సామూహిక స్ఫూర్తిని ఉటంకిస్తూ.. విస్తృతమైన సామాజిక బాధ్యత విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టే చర్యలుంటాయన్నారు. ‘‘కరోనా సంక్షోభం వల్ల ఎదురైన ప్రపంచ ఆర్థిక అంతరాయాల నుంచి పశ్చిమాసియా ఉద్రిక్తతల వరకు మునుపెన్నడూ లేని విధంగాప్రతి దేశమూ ప్రభావితమయ్యేలా అస్థిరతను ఈ ప్రపంచం ఎదుర్కొంటోందికరోనాను ఎలా సమష్టిగా అధిగమించామో.. ఈ సంక్షోభాన్ని కూడా స్థిరమైన ప్రభుత్వం ప్రయత్నం ద్వారా అధగమిస్తాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

వ్యవస్థాగతమైన ఒత్తిడిని ఎదుర్కొనే సమయంలో అవసరమయ్యే వనరు ప్రజాభాగస్వామ్యేనని తెలియజేస్తూ... దేశ స్థిరత్వానికి ఉమ్మడి నిబద్ధతను ప్రదర్శించాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారుపౌరులు తమ కర్తవ్యానికి ఎలా ప్రాధాన్యమవివ్వాలోజాతీయ వనరులపై భారాన్ని ఎలా తగ్గించాలో వివరించారుముడి చమురు విశ్లేషణ ద్వారా దిగుమతులపై భారత్ ఆధారపడటం గురించి వివరించారుఅలాగే ఇంధన భద్రతను అతి పెద్ద బలహీనతగా గుర్తిస్తూ.. ప్రాంతీయ సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఎదురైన అంతరాయాల గురించి ప్రస్తావించారు. ‘‘భారత దేశ ముడి చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగం ప్రస్తుతం ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతం నుంచే వస్తోందిదీనివల్ల కొరతధరల పెరుగుదల వంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయిఈ నేపథ్యంలో దేశానికి ప్రజా భాగస్వామ్య శక్తి అవసరం ఏర్పడింది’’ అని శ్రీ మోదీ తెలిపారు.

పెట్రోలు-డీజీలు వినియోగాన్ని తగ్గించే వ్యూహాల గురించి వివరిస్తూ.. చిన్న చిన్న వ్యక్తిగత తీర్మానాల ద్వారా చేపట్టగలిగే సామూహిక చర్యను సూచించారుకార్ పూలింగ్ సేవలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని సూచించారువర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యమివ్వడంవర్క్ ఫ్రమ్ హోం ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా పని ప్రదేశాలను డిజిటలీకరించాలని కోరారుసాంకేతిక ఆధారిత పరిష్కారాలను సామర్థ్యాన్ని రెట్టింపు చేసే సాధనాలని ఆయన అన్నారు. ‘‘మెట్రోవిద్యుత్ బస్సులుప్రజా రవాణా ఉపయోగించుకుటూ సాధ్యమైన ప్రతి చోటా పెట్రోలుడీజిలు వినియోగాన్ని తగ్గించండిఅనవసరమైన ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వప్రైవేటు కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలకువర్క్-ఫ్రమ్-హోం విధానానికి ప్రాధాన్యమివ్వండి’’ అని శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.

వినోదం కోసం చేసే ఖర్చుల గురించి వివరిస్తూ.. ఆహారంఖరీదైన లోహాల విషయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధాని తెలియజేశారుఆరోగ్య కారణాల దృష్ట్యా వంట నూనె వినియోగాన్ని తగ్గించాలనిసంక్షోభ సమయాల్లో బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధానమంత్రి అభ్యర్థించారువిదేశీ విహారయాత్రలుడెస్టినేషన్ వెడ్డింగులు లాంటి ధోరణుల కారణంగా విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయన్నారుదీని ప్రభావం వివిధ రంగాలపై పడుతోందన్నారు. ‘‘వంట నూనెబంగారం దిగుమతుల కోసం దేశం భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తోందిఅదే సమయంలో డెస్టినేషన్ వెడ్డింగుల వల్ల సైతం ఈ నిల్వలు ఖర్చవుతున్నాయిఈ ప్రపంచ అనిశ్చితి సమయంలో సంయమనం పాటించడం అవసరం’’ అని శ్రీ మోదీ అన్నారు.

విహార యాత్రల కోసం చేస్తున్న వ్యయాన్ని దేశంలోని పర్యాటక గమ్యస్థానాలకు మళ్లించాలంటూ.. ఐక్యతా మూర్తిని వ్యూహాత్మక పర్యాటక ప్రత్యామ్నాయంగా సూచించారుఈ చారిత్రక ప్రదేశాన్ని ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ గమ్యస్థానంగా పేర్కొంటూ.. భారత్ కేంద్రంగా విహార యాత్రలను చేయాలని పిలుపునిచ్చారుఅద్భుతమైన సౌకర్యాలుసాంస్కృతిక ప్రాముఖ్యంఆర్థిక పరమైన ప్రయోజనాలతో పాటుగా పర్యాటక అభివృద్ధిని మారక నిల్వల పరిరక్షణతో ముడిపెట్టారు. ‘‘విహార యాత్రల కోసం భారత్‌లోనే ఖర్చు చేయడందేశంలోని పర్యాటక ప్రాంతాలనే వివాహాల కోసం ఎంచుకోవడం అవసరంఈ విషయంలో గుజరాత్ మీకు గొప్ప గమ్యస్థానాలను అందిస్తోందిడెస్టినేషన్ వివాహాలకు అవసరమైన అద్భుతమైన సౌకర్యాలను స్టాట్యూ ఆఫ్ యూనిటీ అందిస్తుందిఅదే సమయంలో విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ వివరించారు.

ఈ విజ్ఞప్తులను ‘‘ఓకల్ ఫర్ లోకల్’’ నినాదం ద్వారా సమగ్ర జాతీయ ఉద్యమంతో అనుసంధానించారుదేశీయ ఎరువులుసహజ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా దీనిలో ఉన్న వ్యవసాయ కోణాన్ని తెలియజేశారుబహుళ ఆర్థిక రంగాల్లో స్థానికీకరణను ప్రోత్సహిస్తూ... డీజిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేలా సోలార్ పంపులను ఉపయోగించాలని స్పష్టం చేశారుపర్యావరణ సుస్థిరతను విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ లక్ష్యాలతో అనుసంధానించారు. ‘‘విదేశీ వస్తువులకు బదులుగా స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలిమన గ్రామాలునగరాలుదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలిప్రత్యేకించి వ్యవసాయంలో స్వదేశీ ఎరువులనుసహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటుసోలార్ పంపుల వినియోగాన్ని పెంపొందించాలిదీని వల్ల విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లడాన్నిపర్యావరణ భారాన్నీ రెండింటినీ తగ్గించవచ్చు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పరిరక్షణ విజ్ఞప్తులను సామూహిక కార్యాచరణ విధాన పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రజా భాగస్వామ్యానికి పిలుపునిస్తూ.. 140 కోట్ల మంది పౌరుల ఉమ్మడి నిబద్ధతను పరివర్తనాత్మక శక్తిగా గుర్తించారుసంక్షోభాన్ని అధిగమించడంలో సామూహిక శక్తిపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. జాతీయ స్పందనను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారుజాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసేలా దేశవ్యాప్తంగా సమగ్ర సమాజ సమీకరణకు పిలుపునిచ్చారు. ‘‘ఈ ప్రయత్నాలు చిన్నవిగా కనిపించవచ్చుకానీ 140 కోట్ల మంది ఉమ్మడి సంకల్పం తీసుకుంటే ఇలాంటి చిన్న ప్రయత్నాలే దేశానికి అతి పెద్ద శక్తిగా మారతాయిఈ సంక్షోభ ప్రభావం మన ప్రగతిపై లేదా అభివృద్ధిపై పడకుండా మనందరం మరోసారి ఏకమవ్వాలిమనందరం కలిస్తే.. ఈ లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు మన దేశాన్ని బలోపేతం చేసుకోవచ్చు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

తనకు సర్దార్ గౌరవ్ రత్న బిరుదును ప్రదానం చేసినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారుసర్దార్ పటేల్ పేరుతో ముడిపడి ఉన్న ఏ పురస్కారమైనా గొప్ప బాధ్యతతో ముడిపడి ఉందన్నారుగగాజీ భాయ్ చాలా తెలివిగా తనకు ఈ బాధ్యతను అప్పగించారని తనదైన హాస్యచతురతతో చెప్పారువాస్తవరూపం దాల్చని సర్దార్ సాహెబ్ కలలను సాకారం చేయడంఆయన ప్రారంభించిన పనిని పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యంగా మారిందన్నారుసభకు హాజరైన ప్రజలు అందించే ఆశీర్వాదాలుగుజరాత్ నేల నుంచి పుణికిపుచ్చుకున్న విలువలునేర్చుకున్న పాఠాలే తన సంకల్పాన్ని ఎల్లప్పుడూ బలంగా ఉంచుతాయని హామీ ఇచ్చారు.

ప్రపంచం ఎంతగా గౌరవించినప్పటికీ సొంత గడ్డపై లభించే గుర్తింపు ప్రత్యేకమైన ఆనందాన్నిస్తుందన్న జనరల్ కరియప్ప మాటలను గుర్తుచేశారుపెరుగుతున్న భారత శక్తి అంతర్జాతీయంగా గౌరవాన్ని తీసుకొస్తున్నప్పటికీ.. సొంత నేలపై లభించే ఆశీర్వాదాలు సేవ చేసే సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతాయని ప్రధాని పేర్కొన్నారు.

విద్యా రంగంలో సర్దార్ ధామ్ చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించారుఆ సంస్థ చేపట్టిన పరివర్తనాత్మక కృషినివిద్యావకాశాలను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఈ సంస్థ పోషిస్తున్న కీలకపాత్రను ప్రధాని గుర్తించారుఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు యువ సాధికారత పట్ల సామాజిక నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయని అభినందించారు. ‘‘విద్యఅవకాశాల ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించడంలో సమాజ ఉమ్మడి నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్న నేటి ప్రాజెక్టులకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2260529) సందర్శకుల సూచీ సంఖ్య : : 8