ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ పదవీ ప్రమాణం.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 MAY 2026 11:10AM by PIB Hyderabad
తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను అభినందించారు.
ఆయన నూతన పదవీకాలం ఫలప్రదం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయనకు అభినందనలు. ఆయన పదవీకాలం సఫలం కావాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల జీవితాలను మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం ఇక ముందు కూడా తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2259504)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6