భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

అసెంబ్లీ సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు - 2026 రూ.1400 కోట్లకు పైగా విలువైన అక్రమ తాయిలాల జప్తు

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 2:26PM by PIB Hyderabad

1.          అస్సాంకేరళపుదుచ్చేరితమిళనాడుపశ్చిమ బెంగాల్ శాసనసభలకు నిర్వహించిన సాధారణ ఎన్నికలు, 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు చేపట్టిన ఉపఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీకఠినంగా అమలయ్యేలా ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టిందిపశ్చిమ బెంగాల్లోని 144-ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంసీసీ అమలు ముగిసింది.

2.          ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్ జరిగే రాష్ట్రాలువాటి సరిహద్దు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులుసీఈవోలుడీజీపీలుఇతర ఉన్నతాధికారులుఎన్ఫోర్స్మెంట్ సంస్థల అధిపతులతో పలు సమీక్షా సమావేశాలను ఎన్నికల సంఘం నిర్వహించింది.

3.          హింసబెదిరింపులుప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలను నిర్వహించేందుకు ఐఆర్ఎస్ (ఐటీ), ఐఆర్ఎస్ (సీ అండ్ ఐటీ), ఐఏ అండ్ ఏఎస్ఐఆర్ఏఎస్ఐడీఏఎస్ఐపీ అండ్ టీఏఎఫ్ఎస్ఐసీఏఎస్‌ విభాగాల నుంచి 376  మంది వ్యయ పరిశీలకులను నియమించింది7,470 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములను (ఎఫ్ఎస్‌టీలు), 7,470  స్థిర పర్యవేక్షణా బృందాలను (ఎస్ఎస్‌టీలుమోహరించింది.

4. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికిచర్యలు తీసుకోదగిన సమాచారాన్ని సులభంగా పంచుకోవడానికి రూపొందించిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్ఆన్లైన్ వేదిక ద్వారా జప్తులు జరిగాయి. 2026 ఫిబ్రవరి 26 ఈఎస్ఎంఎస్ ప్రారంభమైనప్పటి నుంచి 2026 మే 6 వరకు స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు:

క్రమ సంఖ్య

రాష్ట్రం

నగదు

(రూ.

కోట్లలో)

మద్యం పరిమాణం            (లీటర్లలో)

మద్యం విలువ (రూకోట్లలో)

మాదక ద్రవ్యాల విలువ

(రూకోట్లలో)

విలువైన లోహాల విలువ (రూకోట్లలో)

ఉచితాలు/ఇతరాలు

(రూ.

కోట్లలో)

మొత్తం (రూ.

కోట్లలో)

1 .

తమిళనాడు

105. 22

137248. 53

4. 94

78. 61

165. 86

307. 65

662. 28

2.

పశ్చిమ బెంగాల్

31 . 14

5858648. 98

151 . 86

130. 28

69. 36

190. 77

573. 41

3.

అస్సాం

6. 07

828248. 33

22. 71

70. 08

3. 68

14. 7

117. 24

4.

కేరళ

12. 12

78215. 3

2. 51

58. 47

2. 25

5. 33

80. 67

5.

పుదుచ్చేరి

0. 33

18340. 35

0. 39

0

8. 99

0. 02

9. 72

మొత్తం

154. 89

6988793. 38

183. 33

337. 88

250. 14

518. 73

1444. 96

 

5.           రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ రూ.1029.93 కోట్లుగా ఉందివీటితో పోలిస్తే.. ఇప్పుడు చేసిన జప్తుల్లో 40.14 శాతం పెరుగుదల కనిపించింది. 2021 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2026లో స్వాధీనం చేసుకున్న వాటిలో పశ్చిమ బెంగాల్లో అధికంగా 68.92 శాతం పెరుగుదల కనిపించగాతమిళనాడులో 48.40 శాతం పెరిగాయి.

***


(రిలీజ్ ఐడి: 2258897) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam