హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా

రక్షణ బలగాల అసమాన ధైర్యాన్ని కీర్తించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


మన రక్షణ బలగాల సామర్థ్యాన్ని శత్రువులకు నిరంతరం గుర్తు చేసేలా భారత్ చేపట్టిన నిర్ణయాత్మక సైనిక చర్య.. ‘ఆపరేషన్ సిందూర్’

కచ్చితత్వంతో దాడులు చేయగల మన బలగాల శక్తి, నిఘా సంస్థలు అందించిన నిశిత సమాచారం, రాజకీయ సంకల్పంతో సరిహద్దుల వెంట ఉన్న ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం

ఎక్కడ దాక్కున్నా తప్పించుకోవడానికి వీలుండదని చెప్పే సందేశమిది…

ఎక్కడున్నా మన నిఘా నేత్రం పరిధిలోనే… మన ఆయుధ శక్తికి తల వంచాల్సిందే

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 10:30AM by PIB Hyderabad

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సైనిక బలగాల అసమాన ధైర్య సాహసాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కీర్తించారు. మన బలగాల పోరాట సామర్థ్యాన్ని శత్రువులకు నిరంతరం గుర్తు చేసేలా భారత్ చేపట్టిన గొప్ప సైనిక చర్యగా ఆపరేషన్ సిందూర్ నిలుస్తుందన్నారు.

‘‘మన రక్షణ బలగాల పోరాట సామర్థ్యాన్ని శత్రువులకు ఎల్లప్పడూ గుర్తు చేసేలా భారత్ చేపట్టిన గొప్ప సైనిక చర్యగా ఆపరేషన్ సిందూర్ నిలిచింది. పహల్గాంలో మన పౌరులపై వికృత చర్యకు సాహసించిన ప్రతి ఉగ్రవాది జాడను నాశనం చేయడానికి కచ్చితత్వంతో దాడులు చేయగల మన బలగాల శక్తి, మన నిఘా సంస్థలు అందించిన నిశిత సమాచారం, రాజకీయ సంకల్పం ఏకమైన రోజుగా దీనిని చరిత్ర గుర్తు పెట్టుకుటుంది. ఎక్కడ దాక్కున్నప్పటికీ తప్పించుకోలేరనే సందేశాన్ని ఈ రోజు మన శత్రువులకు అందిస్తూనే ఉంటుంది. వారెప్పుడూ మన నిఘా నేత్రాల నుంచి తప్పించుకోలేరు… మన ఆయుధాల కనుసన్నల్లోనే ఉంటారు. ఈ రోజు మన బలగాల అసమానమైన ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో హోం మంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2258614) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam