పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
పటిష్ఠంగా ఉన్న ఎరువుల లభ్యత.. అవసరాల కంటే ఎక్కువగా కొనసాగుతోన్న సరఫరా
అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ ప్రధాన ఎరువుల గరిష్ఠ రిటైల్ ధరలో రాని మార్పు
ప్రపంచ మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను కాపాడటంతో పాటు అందుబాటు ధరలో ఎరువులు లభించేలా చూసేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న కఠిన చర్యలు.. నిన్న దేశవ్యాప్తంగా 1,800కు పైగా దాడులను నిర్వహించిన అధికారులు
2026 ఏప్రిల్ 1 నుంచి విక్రయమైన సుమారు 19.5 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు
2026 ఏప్రిల్ నెలలో (నిన్నటి వరకు) 346 మెట్రిక్ టన్నులకు (రోజుకు) చేరుకున్న పీఎస్‌యూ ఓఎంసీల సగటు ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు.. 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉన్న సుమారు 177 మెట్రిక్ టన్నుల (రోజుకు) సగటుతో పోలిస్తే సుమారు 95 శాతం పెరుగుదల నమోదు
ఆ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితం.. గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదుర్కొని భారతీయ జెండా కలిగిన నౌకలు
ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు గల్ఫ్ ప్రాంతంలో సంబంధాలను పెంచుకుంటున్న భారత్.. కేవలం ఒక నెల వ్యవధిలోనే రెండు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించిన భారత్, యూఏఈ
ఖతార్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 6:12PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని అందించే చర్యలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జాతీయ మీడియా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- విమానయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు. ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా ఎరువుల రంగానికి సంబంధించిన తాజా విషయాలను ఈ సమావేశంలో వెల్లడించింది.
ఎరువుల నిల్వల పరిస్థితి, లభ్యత
దేశంలో మొత్తం ఎరువుల నిల్వల పరిస్థితి
|
ఉత్పత్తి
|
ఈ రోజు నాటికి
|
గత సంవత్సరం ఇదే రోజు నాటికి
|
|
యూరియా
|
71.58
|
70.67
|
|
డీఏపీ
|
22.35
|
15.07
|
|
ఎన్ పీ కే
|
57.56
|
44.49
|
|
ఎస్ఎస్ పీ
|
26.26
|
26.14
|
|
ఎంఓపీ
|
12.46
|
12.87
|
|
మొత్తం
|
190.21
|
169.24
|
-
2026 ఖరీఫ్ సీజన్ కోసం 390.54 ఎల్ఎంటీల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ (డీఏ-ఎఫ్డబ్ల్యూ) అంచనా వేసింది. ఇవాల్టి వరకు సుమారు 190 ఎల్ఎంటీ (49 శాతం) నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇది సాధారణంగా ఉండే స్థాయి కంటే 33 శాతం ఎక్కువ. మెరుగైన ప్రభుత్వ ప్రణాళిక, ముందస్తు నిల్వ, సమర్థవంతమైన రవాణా నిర్వహణకు ఇది నిదర్శనంగా ఉంది.
-
రాష్ట్రాల్లో ఎరువుల సరఫరా పరిస్థితి మంచి స్థాయిలో ఉంది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 26 వరకు ఉన్న కాలానికి ఎరువుల లభ్యత అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉంది.
-
20.54 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా 71.40 ఎల్ఎంటీల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 6.67 ఎల్ఎంటీల డీఏపీ అవసరానికి గాను 23.09 ఎల్ఎంటీల లభ్యత ఉంది. ఎంఓపీ విషయంలో 1.96 ఎల్ఎంటీలు అవసరం కాగా 8.38 ఎల్ఎంటీలు అందుబాటులో ఉన్నాయి. ఎన్పీకే విషయంలో 8.43 ఎల్ఎంటీల అవసరానికి గాను 53.40 ఎల్ఎంటీల లభ్యత ఉంది. ఎస్ఎస్పీకి సంబంధించి 3.73 ఎల్ఎంటీల అవసరానికి గాను 25.78 ఎల్ఎంటీలు అందుబాటులో ఉన్నాయి. ఈ గణాంకాలు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి దేశంలో ఎరువులు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ప్రధాన ఎరువుల గరిష్ఠ రిటైల్ ధరలు- వీటిలో ఎలాంటి మార్పు లేదు.
|
ఉత్పత్తి
|
యుద్ధానికి ముందు (ఒక్కో సంచికి రూ.)
|
యుద్ధం తర్వాత (ఒక్కో సంచికి రూ.)
|
|
యూరియా
|
266.5
|
266.5
|
|
డీఏపీ
|
1350
|
1350
|
|
టీఎస్‌పీ
|
1300
|
1300
|
-
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ.. యూరియా అంతర్జాతీయ ధర బస్తాకు రూ. 4,000 దాటినప్పటికీ.. ప్రభుత్వం రైతులకు భారీ రాయితీతో 45 కిలోల యూరియా బస్తాను కేవలం రూ. 266.5లకే అందిస్తోంది. ప్రపంచ మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులకు రక్షణ కల్పించడమే కాకుండా వారికి తక్కువ ధరకే ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.
యుద్ధం తర్వాత ఎరువుల దేశీయ ఉత్పత్తి, దిగుమతి
|
ఉత్పత్తి
|
సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి
|
సంక్షోభం తర్వాత భారత ఓడరేవులకు చేరుకున్న దిగుమతులు
|
|
యూరియా
|
35.42
|
9.4
|
|
డీఏపీ
|
4.5
|
0.76
|
|
ఎన్ పీ కే లు
|
12.08
|
1.95
|
|
ఎస్ ఎస్ పీ
|
7.01
|
0
|
|
ఎంఓపీ
|
0
|
1.85
|
|
మొత్తం
|
59.01
|
13.96
|
-
దేశీయ యూరియా ఉత్పత్తికి అవసరమైన సహజ వాయువు లభ్యతకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. ఎరువుల ఉత్పత్తి కేంద్రాలకు సహజ వాయువు సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. అవసరానికి అనుగుణంగా అదనపు ఎల్ఎన్‍జీ లేదా ఆర్ఎల్ఎన్‌జీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఎరువుల ఉత్పత్తి కేంద్రాల్లో 97 శాతం ఎల్ఎన్‌జీ లేదా ఆర్ఎల్ఎన్‌జీ అందుబాటులో ఉంది. చాలా యూరియా ఉత్పత్తి కేంద్రాలు అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.
-
2026 ఫిబ్రవరిలో 13.07 ఎల్ఎంటీల యూరియాను భారత్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం దిగుమతి వనరులను వైవిధ్యపరిచి ప్రపంచ స్థాయి టెండర్ల ద్వారా 25 ఎల్ఎంటీల యూరియాను సేకరించింది.
-
డీఏపీ, టీఎస్‌పీ, అమ్మోనియం సల్ఫేట్ కోసం గ్లోబల్ టెండర్: భారతీయ ఎరువుల కంపెనీలు 12 ఎల్ఎంటీల డీఏపీ, 4 ఎల్ఎంటీల టీఎస్‌పీ, 3 ఎల్ఎంటీ అమ్మోనియం సల్ఫేట్‌ను కొనుగోలు చేసేందుకు శుక్రవారం (24.04.2026) సమగ్ర ప్రపంచ స్థాయి టెండర్‌ను విడుదల చేశాయి. మంచి సీజన్‌లో ఎరువుల అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు ఈ చర్యలు దోహదపడతాయి.
-
ప్రస్తుతం యూరియా, పీ-కే వంటి ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల లభ్యతలో ఎటువంటి ప్రధాన సమస్యలు లేవు.
-
తగిన స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు ఇప్పటివరకు ఈజీఓఎస్ 6 సమావేశాలను నిర్వహించింది. వీటి లభ్యతలో ఎదురైన చాలా వరకు సవాళ్లను ఈజీఓఎస్ పరిష్కరించింది.
-
భారతదేశ ఎరువుల భద్రత బలంగా, స్థిరంగా, చక్కగా ఉంది. అన్ని ప్రధాన ఎరువుల లభ్యత నిరంతరం అవసరానికి మించి ఉంది.
ఇంధన సరఫరా, లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇంధన సరఫరా విషయంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
-
వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
-
ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
-
పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
-
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
-
వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
-
ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
-
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
-
చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ చర్యలు
· నిత్యావసర వస్తువుల చట్టం -1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడానికి, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగుపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీతో సహా నిత్యావసర వస్తువుల సరఫరాను పర్యవేక్షించడంలోనూ, నియంత్రించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు, వీసీల ద్వారా కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
· కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రాసిన లేఖల్లో ఇంధన లభ్యత గురించి ప్రజలకు భరోసానిచ్చేలా చురుగ్గా సమాచారాన్ని ప్రసారం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 02.04.2026న (పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (సమాచార, ప్రసార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కలసి పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన) సమావేశాలు జరిగాయి. వాటిలో దిగువ పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు:
o రోజువారీ పత్రికా సమావేశాలు, ప్రజా మార్గదర్శకాల జారీ.
o సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు/అసత్య సమాచార ప్రసారాల పర్యవేక్షణ, ఎదుర్కోవడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు ప్రచారాలను ముమ్మరం చేయడం, ఓఎంసీలతో సమన్వయంతో దాడులను, తనిఖీలను కొనసాగించడం.
o రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వుల జారీ.
o రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఎస్‌కేవోలను కేటాయించడానికి ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వుల జారీ.
o పీఎన్జీ స్వీకరణను, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ప్రధానంగా గృహావసరాల నిమిత్తం ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం, 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను స్థిరంగా కొనసాగించడానికి లక్షిత పంపిణీని చేపట్టడం.
· అక్రమ నిల్వలు/నల్లబజారులో అమ్మకాలను అరికట్టేందకు కంట్రోలు రూములు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను అన్నిరాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశాయి.
· అనేక రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు విలేకరుల సమావేశాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి/జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగును అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 1800కు పైగా దాడులను నిర్వహించారు.
· పీఎస్‌యూ ఓఎంసీలు ఆకస్మిక తనిఖీలను బలోపేతం చేసి, కొనసాగించాయి. నిన్నటి వరకు 310 ఎల్పీజీ పంపిణీదారులకు జరిమానాలు విధించగా, 71 ఎల్పీజీ పంపిణీదారులను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాలకు ఎల్పీజీ సరఫరా స్థితి:
· కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరా నిరంతరం ప్రభావితమవుతోంది.
· దేశీయ గృహావసరాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చారు.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు అయిపోయినట్లు ఎలాంటి నివేదిక లేదు.
· నిన్న పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగులు 99 శాతం పెరిగాయి.
· మళ్లింపును నియంత్రించేలా డెలివరీ అథంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు 93 శాతం వరకు పెరిగాయి. వినియోగదారుడు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు డీఏసీ వస్తుంది.
· గృహావసర ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేసేందుకు అనేక ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు ఆదివారం కూడా పనిచేశాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
· 10 శాతం సంస్కరణ ఆధారిత కేటాయింపులతో సహా మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను సంక్షోభానికి ముందు స్థాయుల్లో 70 శాతం వరకూ పెంచారు.
· 2026 మార్చి 2-3 నాటికి వలస కార్మికులకు అందించిన రోజువారీ సగటు సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా 21.03.2026న జారీ చేసిన లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రతి రాష్ట్రంలోనూ వలస కార్మికులకు రోజువారీగా అందించే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు 06.04.2026న జారీ చేసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుంది. చమురు మార్కెటింగ్ సంస్థ (ఓఎంసీ)ల సహకారంతో రాష్ట్రాలు వలస కార్మికులకు మాత్రమే వీటిని అందిస్తాయి.
· 2026 ఏప్రిల్ 1 నుంచి అమ్ముడైన 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు సుమారుగా 19.5 లక్షలు.
· 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లకోసం పీఎస్‌యూ ఓఎంసీలు 2026 ఏప్రిల్ 3 నుంచి దాదాపు 9080 అవగాహనా శిబిరాలు నిర్వహించాయి. వీటిలో అమ్ముడైన 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు 1,46,000 పైమాటే.
· 110కి పైగా శిబిరాల ద్వారా నిన్న అమ్ముడైన 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు – 3430.
· రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన ప్రణాళికను రూపొందించడానికి రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంఘాలతో ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ సమన్వయం చేస్తోంది.
· 2026 ఏప్రిల్‌లో (26.04.26 వరకు) మొత్తం 1,65,627 మెట్రిక్ టన్నులు (87.17 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్పీజీ అమ్ముడైంది.
· 2026 ఏప్రిల్ నెలలో (26.04.26 వరకు) పీఎస్‌యూ ఓఎంసీల ద్వారా అమ్ముడైన ఆటో ఎల్పీజీ సరాసరి అమ్మకాలు రోజుకి 346 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన అమ్మకాల సగటు రోజుకి 177 ఎంటీలుగా ఉంది. ఇది పీఎస్‌యూ ఓఎంసీల ద్వారా ఆటో ఎల్పీజీ అమ్మకాల్లో సుమారు 95 శాతం వృద్ధిని సూచిస్తుంది.
సహజ వాయు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ-పీఎన్జీ, సీఎన్‌జీ రవాణాకు 100 శాతం సరఫరాలను అందించడం ద్వారా వినియోగదారులకు ప్రాధాన్యం లభించింది.
· ఎరువుల కర్మాగారాల ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా 95 శాతానికి మొత్తం గ్యాసు కేటాయింపులు పెరిగాయి.
· అదనంగా, సీజీడీ నెట్‌వర్కుల ద్వారా సరఫరాలతో సహా పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో గ్యాసు సరఫరా 80 శాతానికి పెరిగింది.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తమ జీఏల్లో నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు సూచన అందింది.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ సహా సీజీడీ సంస్థలు గృహ, వాణిజ్య అవసరాల కోసం పీఎన్జీ కనెక్షన్లను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్కులను విస్తరించడానికి అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరడమైనది.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేందుకు దీర్ఘకాలిక పరివర్తనకు రాష్ట్రాలు మద్దతు అందిస్తే.. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 వాణిజ్య ఎల్పీజీని కేటాయింపుల ప్రతిపాదనను 18.03.2026న రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు సంబంధించి 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీని పొందుతున్నాయి.
· కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 నాటి లేఖ ద్వారా, సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి.. మూడు నెలల ప్రత్యేక వ్యవధితో కూడిన తగ్గించిన కాలపరిమితితో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన అనుమతుల విధానాన్ని ఆమోదించింది.
· 24.03.2026న జారీ చేసిన గెజిట్ ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయడానికి, విస్తరించడానికి క్రమబద్ధీకరించిన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది అనుమతుల్లో జరిగే జాప్యాన్ని, భూసేకరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, నివాస ప్రాంతాలతో సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పీఎన్జీ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేస్తుందనీ, సమాజంలో చివరి అంచెల వరకూ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందనీ, శుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు మద్దతునిస్తుందనీ భావిస్తున్నారు. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ, భారతదేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతుంది.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగంగా విస్తరించాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్‌బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణ వేగాన్ని కొనసాగించేందుకు జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
· మరింత శుద్ధమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి సాధించిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి రాష్ట్ర సీబీజీ విధానం నమూనా ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు చేయడానికి వీలుగా ఉండే సీబీజీ అభివృద్ధి వ్యవస్థను రాష్ట్రాలను నిర్మించుకోవడానికి, ఈ నమూనా సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధానంగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు, తదుపరి విడతలో కేటాయించే అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కుతుంది.
· కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 07.04.2026న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా.. సీజీడీ నెట్‌వర్క్ లేదా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు లేదా నిర్వహణకు అవసరమైన అనుమతులను 15 రోజుల లోపు మంజూరు చేసేలా ఎస్‌పీసీబీ/పీసీసీలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
· మార్చి 2026 నుంచి సుమారుగా 5.52 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. అదనంగా మరో 2.63 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.15 లక్షలకు చేరుకుంది. అంతేకాకుండా, సుమారు 6.21 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· 21.04.2026 నాటికి ఎంవైపీఎన్‌జీడీ.ఇన్ వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను 42,600 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు సరెండర్ చేశారు.
ముడి చమురు స్థాయి, శుద్ధి కార్యకలాపాలు
· అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అదే సమయంలో పెట్రోలు, డీజిలు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయి.
· గృహ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కర్మాగారాల్లో గృహావసర ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు అంతర మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యవర్గ బృందం (జేడబ్ల్యూజీ) ఏర్పాటైంది. అదేవిధంగా, 01.04.2026న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్ణయించిన కీలక రంగాల్లో కనీసం పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచడానికి పెట్రో కెమికల్ కాంప్లెక్సులతో సహా చమురు శుద్ధి కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
· ఫార్మాసూటికల్ విభాగం, రసాయనాలు-పెట్రో రసాయనాల విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన వినతుల ఆధారంగా ఫార్మా, రసాయన రంగ సంస్థలకు ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1000 ఎంటీలను కేటాయించారు.
· 2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, మధుర రిఫైనరీల నుంచి రసాయన, ఫార్మా పరిశ్రమలకు 7800 ఎంటీలకు పైగా ప్రొపిలీన్ అమ్మకాలు జరిగాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు
ప్రభుత్వ రంగ సంస్థల రిటైల్ అవుట్‌లెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి. వదంతుల కారణంగా కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో భయాందోళనతో కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత ఉండేలా చూసుకుంటున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. వినియోగదారులను అధిక ధరల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
దేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు, భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50కి, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42కి పెంచింది.
పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల రిటైల్ అవుట్‌లెట్‌లలో ధరల పెంపు ఏదీ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా, 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును అందించారు.
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. కాగా హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ తమకు దీని అవసరం లేదని సూచించాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో కింది విషయాలను పేర్కొన్నది:
ఈ నెల 25వ తేదీన, టోగో జెండా కలిగిన ఎమ్‌టీ చిరాన్ 7 (ఐఎమ్‌వో నం. 9127291) అనే చమురు, రసాయన ట్యాంకర్‌కు సంబంధించిన నౌక విషయంగా ఒక సంఘటన జరిగింది. ఈ నౌకలో 17 మంది భారతీయ నావికులు (మొత్తం సిబ్బంది: 24) ఉన్నారు. ఈ సంఘటన ఒమన్‌లోని షినాస్ ఔటర్ పోర్ట్ లిమిట్ వద్ద జరిగింది. ఇరాన్ కోస్ట్ గార్డ్ అడ్డగించిన నౌకల సమీపంలో ఈ నౌక ప్రయాణిస్తుండగా, హెచ్చరికగా కాల్పులు జరిపారు. నౌకలోని 17 మంది భారతీయ నావికులు క్షేమంగా ఉన్నారు.
నావికుల సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలూ నమోదవలేదు.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 7,780 కాల్స్, 16,658కి పైగా ఈమెయిళ్లను స్వీకరించి, పరిష్కరించింది. గత 24 గంటల్లో 25 కాల్‌లు, 140 ఈమెయిళ్లూ అందాయి.
స్వదేశానికి తరలింపుపై తాజా సమాచారం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా ఇప్పటివరకు 2,776 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించుటను మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన 12 మంది నావికులూ వీరిలో ఉన్నారు.
పోర్ట్ కార్యకలాపాలు: దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:
భారత పౌరులు, వారి కుటుంబాల నుంచి వచ్చే విచారణలకు స్పందించేందుకు మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది.
సమాచార మార్పిడి, కృషిలో మెరుగైన సమన్వయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు సకాలంలో సహాయం అందించేందుకు నిరంతరం పనిచేసే హెల్ప్‌లైన్‌లను కొనసాగిస్తూ, మన పౌరులకు చురుగ్గా సహాయపడుతున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలు జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌర సంఘాలతో చురుగ్గా మమేకమై ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరించడం కోసం వారు భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సహాయం అందించడం, భారత్‌కి తిరిగి రావడానికి చేసే అభ్యర్థనల్లో తోడ్పడటం సహా... భారతీయ దౌత్య కార్యాలయాలు వారికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమాన ప్రయాణ పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 13,19,000 మంది ప్రయాణికులు భారత్‌కు ప్రయాణించారు.
యూఏఈలో విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ-భారత్ మధ్య పరిమిత వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు యూఏఈ- భారత్ మధ్య సుమారు 105 విమానాలు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్‌వేస్ భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు త్వరలో ఖతార్ నుంచి భారత్‌కు విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి.
కువైట్ గగనతలం తెరిచి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాయి.
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.
ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిని భారత్‌కు తిరుగు ప్రయాణం కోసం వినియోగించుకోవచ్చు.
ఇరాన్ గగనతలం సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం సహాయంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా తిరిగి వెళ్లాలని కోరడమైనది. ఇప్పటివరకు, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,461 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.
ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి, వీటిని భారత్‌కు తిరుగు ప్రయాణం కోసం వినియోగించుకోవచ్చు.
గల్ఫ్ ప్రాంతానికి విస్తరణ
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, గల్ఫ్ ప్రాంతంలోని దేశాలతో భారత్ తన సంబంధాలను విస్తరిస్తోంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల 25-26 తేదీల్లో యూఏఈని అధికారికంగా సందర్శించారు. ఈ నెల 25న ఆయన ఆ దేశ అధ్యక్షుడు గౌరవ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలుసుకుని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరపున శుభాకాంక్షలను తెలియజేశారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు, ప్రాంతీయ పరిస్థితులు, పరస్పర ప్రయోజనకరమైన ఇతర అంశాలపైనా ఇరు పక్షాలు చర్చించాయి.
నెల రోజుల్లో భారత్, యూఏఈల మధ్య జరిగిన రెండో ఉన్నత స్థాయి సమావేశం ఇది. అంతకుముందు, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఏప్రిల్ 11-12 తేదీల్లో యూఏఈలో పర్యటించారు. ఆయన యూఏఈ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఆ దేశాధ్యక్షులు గౌరవ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌నూ కలిశారు. పశ్చిమాసియా సంఘర్షణ సమయంలో భారతీయ పౌరుల సంక్షేమాన్ని నిర్ధారించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై మార్గనిర్దేశం చేసినందుకు విదేశాంగ మంత్రి ఆ దేశ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2256160)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam