ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన


వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
రైలు, రహదారులు, నీరు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు సహా పలు రంగాలకు చెందిన ప్రాజెక్టులు

బనారస్-పూణే (హడప్సర్), అయోధ్య-ముంబయి (లోకమాన్య తిలక్ టెర్మినస్) మార్గాల్లో రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

హర్దోయ్‌లో 594 కిలోమీటర్ల పొడవైన, యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం

సుమారు రూ. 36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో మీరట్-ప్రయాగ్రాజ్ మధ్య గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం

ప్రస్తుతం 10-12 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం దాదాపు 6 గంటలకు తగ్గనుంది

షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవైన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ద్వారా ఆర్థిక ప్రయోజనాలకు మించి వ్యూహాత్మక విలువను చేకూర్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య విశేషం

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2026 3:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారుఈ నెల 28 సాయంత్రం సుమారు గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారుఅక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిశంకుస్థాపన చేస్తారుఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.

ఈ నెల 29న ఉదయం సుమారు 8:30 గంటలకు వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించిపూజలు నిర్వహిస్తారుఆ రోజున ఉదయం సుమారు 11:30 గంటలకు ప్రధానమంత్రి హర్దోయ్‌కు చేరుకుని గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.

వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన

ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారురూ. 1,050 కోట్లకు పైగా విలువైన 48 ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారువారణాసి-అజంగఢ్ రహదారి విస్తరణ పూర్తి చేయడం... కజక్‌పురాకదిపూర్‌లలో కీలకమైన రైల్ ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించడం... భగవాన్‌పూర్‌లో 55 ఎమ్ఎల్‌డీల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్‌టీపీ)ను ప్రారంభించడం వంటివి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.

సమాజ కేంద్రితమైన పలు ప్రాజెక్టులనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారుజల్ జీవన్ మిషన్ కింద 30 గ్రామీణ తాగునీటి పథకాలుచంద్రావతి ఘాట్ పునరాభివృద్ధిసారనాథ్ సమీపంలోని సారంగనాథ్ ఆలయ పర్యాటకాభివృద్ధినాగ్వాలోని సంత్ రవిదాస్ పార్క్ సుందరీకరణపునరుద్ధరణ పనులు వీటిలో భాగంగా ఉన్నాయిప్రజా సేవలుక్రీడల రంగాలను మెరుగుపరచే పలు కార్యక్రమాలూ ఉన్నాయియూపీ కళాశాలలో సింథటిక్ హాకీ టర్ఫ్రామ్‌నగర్‌లో 100 పడకల వృద్ధాశ్రమంభేలుపూర్ నీటి శుద్ధి కర్మాగారంలో మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వీటిలో భాగంగా ఉన్నాయిసాంప్రదాయిక వైద్య విధానాలను ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో అనుసంధానించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ... సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టిబెటన్ స్టడీస్‌లో సోవా రిగ్పా భవన్ఆసుపత్రినీ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

సుమారు రూ. 5,300 కోట్ల విలువైన 112కు పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారువీటిలో అమృత్ 2.0 కింద చేపట్టే 13 మురుగునీటి శుద్ధినీటి సరఫరా పథకాలు... శ్రీ శివ ప్రసాద్ గుప్తా డివిజనల్ జిల్లా ఆసుపత్రిలో 500 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... భోజువీర్సిగ్రాలో మార్కెట్ కాంప్లెక్స్‌లుకార్యాలయాల నిర్మాణం... చెరువుల పునరుద్ధరణపునరుజ్జీవనం... 198 పడకల ఆసుపత్రి పునరాభివృద్ధి... 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం... అస్సీ ఘాట్దశాశ్వమేధ ఘాట్నమో ఘాట్ వంటి కీలక ఘాట్‌లలో పర్యాటక సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉన్నాయిపరిపాలనసామాజిక సంక్షేమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గానూ రామ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్నగర నిగమ్ కార్యాలయ భవనంప్రభుత్వ బాలల సంరక్షణ గృహంజువెనైల్ జస్టిస్ బోర్డుకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుబనాస్ డెయిరీతో అనుబంధం ఉన్న ఉత్తరప్రదేశ్ పాల సరఫరాదారులకు రూ. 105 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రధానమంత్రి బోనస్‌గా బదిలీ చేయనున్నారు.

గంగా నదిపై రైలు-రోడ్డు వంతెన నిర్మాణం సహావారణాసి జంక్షన్ – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మూడోనాల్గో రైల్వే లైన్ ప్రాజెక్టుకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్టు రైలు రద్దీని తగ్గించడంరవాణా సామర్థ్యాన్ని పెంచడంబహుళ రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడంసులభమైన ట్రాఫిక్ రాకపోకలను నిర్ధారించడం ద్వారా వారణాసిచందౌలి జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుందిఇది కాశీ విశ్వనాథ్ ధామ్రామ్‌నగర్ ప్రాంతంజాతీయ రహదారి-19కి ప్రవేశాన్ని మెరుగుపరచడంతో పాటు... తూర్పు ఉత్తరప్రదేశ్బీహార్‌లతో రైలు అనుసంధానాన్నీ బలోపేతం చేస్తుంది.

బనారస్–పూణే (హడప్సర్), అయోధ్య–ముంబయి (లోకమాన్య తిలక్ టెర్మినస్అనే రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ రైళ్లు సరసమైనఆధునిక ప్రయాణ సౌకర్యాలను అందించడంతో పాటు ఉత్తర ప్రదేశ్మధ్యప్రదేశ్మహారాష్ట్రల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయిబనారస్–పూణే సర్వీస్ కాశీ విశ్వనాథ ధామ్‌కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుండగాఅయోధ్య–ముంబయి సర్వీస్ శ్రీ రామ్ మందిర్ తీర్థ క్షేత్రానికి అనుసంధానాన్ని మెరుగుపరుస్తూప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.

హర్దోయ్‌లో ప్రధానమంత్రి పర్యటన

దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి హర్దోయ్ జిల్లాలో ప్రారంభించనున్నారుగంగా ఎక్స్‌ప్రెస్‌వే 594 కిలోమీటర్ల పొడవులేన్‌లు (8 లేన్‌ల వరకు విస్తరించగలవి)యాక్సెస్-నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ హై-స్పీడ్ కారిడార్ కలిగి ఉందిదీనిని సుమారు రూ. 36,230 కోట్ల వ్యయంతో నిర్మించారుఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్బులంద్‌షహర్హాపూర్అమ్రోహాసంభాల్బదౌన్షాజహాన్‌పూర్హర్దోయ్ఉన్నావ్రాయ్‌బరేలిప్రతాప్‌గఢ్ప్రయాగ్‌రాజ్ వంటి 12 జిల్లాల గుండా వెళుతుందితద్వారా ఇది ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమమధ్యతూర్పు ప్రాంతాలను ఒకే నిరంతరాయ హై-స్పీడ్ కారిడార్ ద్వారా అనుసంధానిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరట్ప్రయాగరాజ్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం తీసుకునే 10-12 గంటలు..సుమారు గంటలకు తగ్గుతుందిదీని ద్వారా రవాణాలో సౌలభ్యంసామర్థ్యం మెరుగుపడతాయని అంచనా.

ఈ ప్రాజెక్టులోని ఒక ముఖ్యమైన విశేషం... షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవైన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని (విమానాశ్రయాన్నిఏర్పాటు చేయడంఈ ద్వంద్వ ప్రయోజన మౌలిక సదుపాయం జాతీయ భద్రతా సంసిద్ధతను పెంపొందించిఆర్థిక ప్రయోజనాలకు మించి వ్యూహాత్మక విలువనూ చేకూరుస్తుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ఒక ప్రధాన ఆర్థిక కారిడార్‌గా భావిస్తున్నారుదీని మార్గంలో ఉన్న 12 జిల్లాల్లో సుమారు 2,635 హెక్టార్లలో సమీకృత ఉత్పాదకలాజిస్టిక్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారుఈ ఎక్స్‌ప్రెస్‌వే లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించిరవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచిఉత్పాదక రంగ సమర్థతనూ పెంచుతుంది.

మెరుగైన అనుసంధానం ద్వారా రైతులకు పట్టణాలుఎగుమతి మార్కెట్లు నేరుగా అందుబాటులోకి రానున్నాయిఇది వారి పంటలకు మంచి ధర లభించడానికిగ్రామీణ ఆదాయాలు బలపడటానికి దోహదపడుతుందిపర్యాటకాన్ని ప్రోత్సహించడంకొత్త ఆర్థిక అవకాశాలను అందుబాటులోకి తేవడంఈ ప్రాంతం అంతటా ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేజేవార్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేఫరూఖాబాద్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేమీరట్ నుంచి హరిద్వార్ వరకు ప్రతిపాదిత పొడిగింపు సహా... ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్రణాళికలో ఉన్న అనేక అనుసంధాన కారిడార్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలోని విస్తృత ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌కు వెన్నెముకగా నిలవనుందిఅభివృద్ధి చెందుతున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే గ్రిడ్... ఉత్తర ప్రదేశ్ అంతటా తూర్పు నుంచి పశ్చిమానికిఉత్తరం నుంచి దక్షిణానికి హై-స్పీడ్ రహదారి అనుసంధానాన్ని విస్తరింపజేసిసమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక రవాణా ప్రాజెక్ట్ మాత్రమే కాదుఇది రవాణా ఖర్చులను తగ్గించిపారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించివ్యవసాయ-గ్రామీణ ఆదాయాలను పెంచిఉపాధిని కల్పించిరాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ ఆర్థిక వృద్ధిని సాధించే ఒక పరివర్తనాత్మక కార్యక్రమం.

 

***


(రిలీజ్ ఐడి: 2255731) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati