సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చింతన్ శిబిర్‌లో యాచకులు, ఆశ్రయ గృహాల సంరక్షణ, పునరావాసం, నిర్వహణ కోసం నమూనా మార్గదర్శకాల ఆవిష్కరణ

प्रविष्टि तिथि: 25 APR 2026 10:41AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నెల 24 నుంచి 26 వరకు చండీగఢ్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిర్వహించిన చింతన్ శిబిర్ సందర్భంగా... యాచకులు, ఆశ్రయ గృహాల సంరక్షణపునరావాసం, నిర్వహణ గురించిన నమూనా మార్గదర్శకాలను ఆవిష్కరించింది.

నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యంమౌలిక సదుపాయాలు, సామర్థ్యంపోషణ, ఆహార భద్రతవృత్తి శిక్షణ, పునరావాసంన్యాయ సహాయం, అవగాహనచైల్డ్-జెండర్ సెన్సిటివిటీజవాబుదారీతనం, పర్యవేక్షణ వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ ఈ మార్గదర్శకాలు ఒక సమగ్రమైన విధాన ప్రణాళికను అందిస్తాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పైన పేర్కొన్న ఆదేశాలను ఏకరీతిగా అమలు చేయడానికి వీలుగా వాటిని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సమ్మిళితం చేయాల్సిన ఆవశ్యకతను ఇవి స్పష్టం చేస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న యాచకుల, ఆశ్రయ గృహాల్లో మానవతా పూర్వకగౌరవప్రదమైన జీవన పరిస్థితులను నిర్ధారించడానికిఈ మార్గదర్శకాలను పరిపూర్ణంగా, సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

 

***


(रिलीज़ आईडी: 2255514) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Kannada