ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని గౌహతిలో భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీఎం ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 13 SEP 2025 8:57PM by PIB Hyderabad

నేను భూపేన్ దాఅని చెప్తానుమీరు 'అమర్ రహేఅమర్ రహే'! అని చెప్పండి (ఆయన చిరకాలం వర్ధిల్లాలి)

భూపేన్ దాఅమర్ రహేఅమర్ రహే!

భూపేన్ దాఅమర్ రహేఅమర్ రహే!

భూపేన్ దాఅమర్ రహేఅమర్ రహే!

అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యప్రజాదరణ పొందిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మఅరుణాచల్‌ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమాఖండూమంత్రివర్గ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్వేదికపైనున్న భూపేన్ హజారికా సోదరుడు శ్రీ సమర్ హజారికాభూపేన్ హజారికా సోదరి శ్రీమతి కవితా బారువాభూపేన్ దా కుమారుడు శ్రీ తేజ్ హజారికా.. తేజ్, 'కెమ్ చోఅని పలకరిస్తున్నాఇక్కడకు విచ్చేసిన ఇతర ప్రముఖులకుఅస్సాం సోదరీసోదరులకు వందనాలు!

ఇవాళ ఎంతో అద్భుతమైన రోజుఈ క్షణం వెలకట్టలేనిదిఇక్కడ నేను చూసిన దృశ్యంఉత్సాహంసామరస్యంభూపేన్ దా సంగీతంలోని లయ.. భూపేన్ దా మాటల్లోనే చెప్పాలంటే, "సమయ్ ఓ ధీరే చలోసమయ్ ఓ ధీరే చలోఅని నా హృదయం పదే పదే ప్రతిధ్వనిస్తోందిభూపేన్ దా సంగీతపు కెరటం నిరంతరం ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాఇక్కడ ప్రతి సందర్భం నూతన రికార్డును సృష్టించటం అస్సాం ప్రత్యేకతమీ ప్రదర్శనల వెనకున్న అపారమైన కృషి ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందిమీ అందరికీ నా అభినందనలు.

మిత్రులారా,

కొద్ది రోజుల కిందట సెప్టెంబర్ 8న మనం భూపేన్ హజారికా జయంతిని జరుపుకున్నాంఆ రోజున భూపేన్ దాకు అంకితమిచ్చిన వ్యాసంలో నా భావోద్వేగాలను పంచుకున్నాను 100వ జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నానునేను ఇక్కడికి రావటం ద్వారా ఆశీస్సులు అందించానని ఇప్పుడే శ్రీ హిమంత బిస్వ శర్మ చెప్పారుకానీ నిజానికి అది దానికి విరుద్ధంఇటువంటి పవిత్రమైన సందర్భంలో ఇక్కడ ఉండటం నా అదృష్టంమనమందరం భూపేన్‌ను ఎంతో ఇష్టంగా 'సుధా కంఠఅని పిలుచుకుంటాంభారతీయ భావోద్వేగాలకు గొంతుకనిచ్చినసంగీతానికి సున్నితత్వాన్ని జోడించినభారతీయుల కలలను పాటల్లో అల్లిన.. గంగా బెహతీ హో క్యూన్గంగా బెహతీ హో క్యూన్అంటూ గంగామాత కరుణను భారతావనికి వినిపించిన ఆ 'సుధా కంఠశతజయంతి సంవత్సరమిది.

మిత్రులారా,

చిరస్థాయిగా నిలిచిపోయే భూపేన్ దా స్వరకల్పనలు భారతావనిని ఐక్యం చేస్తూతరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

సోదరీసోదరులారా,

భూపేన్ దా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలుస్వరం నేటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తూ మనల్ని ఉత్తేజపరుస్తున్నాయిభూపేన్ దా శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తోందిభూపేన్ హజారికా గీతాలనుసందేశాలను ఆయన జీవిత ప్రయాణాన్ని మేం ప్రతి ఇంటికీ తెలియజేస్తున్నాంఇవాళ ఇక్కడ ఆయన జీవిత చరిత్రను విడుదల చేశాంఈ సందర్భంగా డాక్టర్ భూపేన్ హజారికాకి నేను హృదయపూర్వక నివాళులర్పిస్తున్నానుభూపేన్ దా శత జయంతి సంవత్సరం సందర్భంగా నా అస్సాం సోదరీసోదరులతో పాటు భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

భూపేన్ హజారికా జీవితం మొత్తం సంగీత సేవలో తరించారుసంగీతం ధ్యానంగా మారినప్పుడు ఆత్మను స్పృశిస్తుందిసంగీతం ఒక సంకల్పంగా మారినప్పుడు.. అది సమాజానికి సరికొత్త దిశను చూపే మాధ్యమం అవుతుందిఅందుకే భూపేన్ దా సంగీతం ఎంతో ప్రత్యేకమైనదిఆయన ఏ ఆశయాల కోసమైతే జీవించారోఏ అనుభవాలనైతే పొందారోవాటినే పాటల రూపంలో ఆలపించారుఆయన పాటల్లో భరతమాత పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుందిఎందుకంటే 'ఏక్ భారత్శ్రేష్ఠ భారత్స్ఫూర్తిని ఆయన ఆచరించారు.

ఈశాన్య భారతంలో భూపేన్ జన్మించారుబ్రహ్మపుత్ర నది పవిత్ర అలలు ఆయనకు సంగీత పాఠాలను నేర్పాయితర్వాత గ్రాడ్యూయేషన్ కోసం ఆయన కాశీకి వెళ్లారుబ్రహ్మపుత్ర అలలతో మొదలైన ఆ సంగీతాన్వేషణగంగానది మధుర నాదంతో పరిపూర్ణమైందికాశీ నగర చైతన్యం ఆయన జీవితానికి అచంచలమైన ప్రవాహాన్ని ఇచ్చిందిఆయన యాత్రికునిలా మారి భారత్ వ్యాప్తంగా పర్యటించారుపీహెచ్‌డీ కోసం ఏకంగా అమెరికాకు వెళ్లారుఅయినప్పటికీజీవితంలోని ప్రతి దశలోనూ ఆయన అస్సాం పుత్రుడిగా ఆ నేలతో అనుబంధాన్ని కొనసాగించారుఅందుకే ఆయన తిరిగి భారతదేశానికి వచ్చారుఇక్కడ సినిమా రంగంలో సామాన్యుడి గొంతుకగా మారారుప్రజల జీవితాల్లోని బాధలకు ప్రాణం పోశారుఆ స్వరం నేటికీ మనల్ని కదిలిస్తూనే ఉంది.

ఆయన గీతం “మనుహే మనుహోర్ బాబేజోదిహే ఆకోను నభాబేఆకోని హోహానుభూతిరేభాబిబో కోనేను కువా?” అంటే.. మనుషులే సాటి మనుషుల సుఖదుఃఖాలుబాధలుకష్టాల గురించి ఆలోచించకపోతేఇక ఈ ప్రపంచంలో ఒకరి గురించి ఒకరు శ్రద్ధ వహించేదెవరుఅని అర్థంఒక్కసారి ఊహించండి.. ఇది మనకెంత స్ఫూర్తిదాయకమోసరిగ్గా ఇదే స్ఫూర్తితో గ్రామాల్లోని ప్రజలుపేదలుదళితులుఅణగారినగిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచటంలో నేడు భారత్ నిమగ్నమై ఉంది.

మిత్రులారా,

భారతదేశ ఐక్యతకుసమగ్రతకు భూపేన్ దా గొప్ప ధీరుడుదశాబ్దాల కిందట ఈశాన్య భారతం నిర్లక్ష్యానికి గురైనప్పుడుహింసవేర్పాటువాద సెగల్లో దగ్ధమవుతున్నప్పుడు.. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భూపేన్ దా భారతదేశ ఐక్యత కోసం గళాన్ని వినిపించారుఆయన ఒక సుసంపన్నమైన ఈశాన్య భారతాన్ని కలగన్నారుప్రకృతి ఒడిలో విలసిల్లే ఈశాన్య రాష్ట్రాల అద్భుత సౌందర్యాన్ని పాటల ద్వారా కొనియాడారుఅస్సాం గురించి ఇలా పాడారు:

"నానా జాతి-ఉపోజాతిరహోనియా క్రిష్టిఅకువాలి లోయి హోయిసిల్ సృష్టిఈ మోర్ అహోం దేశ్” పాటను హమ్ చేసినప్పుడు అస్సాం వైవిధ్యంబలంసామర్థ్యం పట్ల మాకు గర్వంగా ఉంటుంది.

మిత్రులారా,

అతను అరుణాచల్‌ను ఎంతగానో ప్రేమించాడుఅందుకే ఇవాళ అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు. "అరుణ్ కిరణ్ శిష్ భూషణ్భూమి సురమయి సుందరఅరుణాచల్ హమారాఅరుణాచల్ హమారాఅని భూపేన్ దా రాశారు.

మిత్రులారా,

నిజమైన దేశభక్తుడి హృదయాంతరాల నుంచి వచ్చే స్వరం ఎన్నటికీ వృథాగా పోదుఈశాన్య భారతం పట్ల ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు మేం అహర్నిషలు శ్రమిస్తున్నాంభూపేన్ దాకు భారత రత్నను ప్రదానం చేయడం ద్వారా మా ప్రభుత్వం ఈశాన్య ప్రాంత కలలనుగౌరవాన్ని చాటిచెప్పడమే కాకఈశాన్య భారతాన్ని దేశ ప్రాధాన్యతల్లో ఒకటిగా నిలిపిందిఅస్సాంఅరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెనల్లో ఒకదానికి భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టాంనేడు అస్సాంఈశాన్య భారతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిఅభివృద్ధిలోని ప్రతి అంశంలోనూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయిఈ అభివృద్ధి విజయాలే భూపేన్ దాకు దేశం అర్పించే నిజమైన నివాళి.

మిత్రులారా,

మన అస్సాంమన ఈశాన్య భారతం.. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఎల్లప్పుడూ గొప్ప సహకారాన్ని అందిస్తున్నాయిఇక్కడి చరిత్రపండగలువేడుకలుకళలుసంస్కృతిప్రకృతి సౌందర్యందైవిక భావన.. వీటన్నింటితో పాటు భారతావని ప్రతిష్ఠఆత్మగౌరవంరక్షణకు ఇక్కడి ప్రజల త్యాగాలు లేని భారతదేశాన్ని మనం ఊహించలేంనిజంగా మన ఈశాన్య ప్రాంతం దేశానికే ఒక కొత్త వెలుగుకొత్త ఉదయం వంటిదిఎందుకంటే మన దేశంలో మొదటగా ఇక్కడే సూర్యోదయం అవుతుందిభూపేన్ దా పాటలో ఇదే భావాన్ని పలికించారు: “అహోం అమర్ రుపోహిగుణోరు నై హేష్భారతర్ పూర్బో దిఖర్సూర్యో ఉఠా దేశ్!”

సోదరీసోదరులారా,

అస్సాం చరిత్రను కీర్తించినప్పుడే భారతదేశ చరిత్ర పరిపూర్ణమవుతుందిఅప్పుడే భారత్ ఆనందం పరిపూర్ణమవుతుందిమనం గర్వంతో ముందుకు సాగుతుండాలి.

మిత్రులారా,

సాధారణంగా అనుసంధానం గురించి మాట్లాడితే… రైలురోడ్డువిమాన మార్గాల గురించే ఆలోచిస్తాంకానీ దేశ సమగ్రతకు వీటితో పాటు మరో ముఖ్యమైన అనుసంధానం అవసరం… అదే సాంస్కృతిక అనుసంధానంపదకొండేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనేదేశ సాంస్కృతిక అనుసంధానానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాంఇదొక నిరంతర ప్రక్రియగా సాగుతున్న మహా యజ్ఞంకార్యక్రమంలో ఆ లక్ష్యానికి సంబంధించిన వెలుగుని ఇవాళ మనం చూస్తున్నాంకొంతకాలం కిందటే జాతీయ స్థాయిలో వీర లచిత్ బోర్ఫుకన్ 400వ జయంతి వేడుకలను మనం ఘనంగా జరుపుకున్నాంస్వాతంత్య్ర పోరాటంలోనూ అస్సాంఈశాన్య భారతంలోని అసంఖ్యాక యోధులు సాటిలేని త్యాగాలు చేశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్సందర్భంగా… ఈశాన్య భారత స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రనుఈ ప్రాంత విశిష్టతను మనం మరోసారి స్మరించుకున్నాంఈ రోజు దేశమంతా అస్సాం చరిత్రనుఆ రాష్ట్రం అందించిన సహకారాన్ని తెలుసుకుంటోందిఇటీవల మనం ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవాన్ని కూడా నిర్వహించాంఆ వేడుకల్లోనూ అస్సాం శక్తి సామర్థ్యాలునైపుణ్యం స్పష్టంగా కనిపించాయి.

మిత్రులారా,

పరిస్థితులు ఎలా ఉన్నా అస్సాం ఎల్లప్పుడూ దేశ ఆత్మగౌరవాన్ని చాటిచెబుతూనే ఉందిఅదే స్వరాన్ని మనం భూపేన్ దా గీతాల్లో వింటాం. 1962 యుద్ధాన్ని అస్సాం ప్రత్యక్షంగా చూసిందిఆ సమయంలో భూపేన్ దా పాటలతో దేశానికి కొండంత బలాన్ని ఇచ్చారు. “ప్రోతి జోవాన్ రుక్తోరే బిందుహహహోర్ అనంత్ హిందూసే హహహోర్ దుర్జోయ్ లాహోర్జషీలే ప్రతిజ్ఞ జోయ్‌రే” అంటూ పాడారుఆ ప్రతిజ్ఞ దేశ ప్రజలందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

మిత్రులారా,

ఆ భావంఆ స్ఫూర్తి ప్రజల హృదయాల్లో ఇప్పటికీ శిలలా దృఢంగా నిలిచి ఉన్నాయిఆపరేషన్ సిందూర్ సమయంలోనూ మనం చూశాంపాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలకు భారత్ ఎంత ధీటైన సమాధానం ఇచ్చిందంటే.. భారత పరాక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించిందిభారతదేశ శత్రువు ఏ మూలనున్నా సురక్షితంగా ఉండలేరని మేం నిరూపించాంభద్రతఆత్మగౌరవం విషయంలో నవ భారతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదు.

మిత్రులారా,

అస్సాం సంస్కృతిలో ప్రతీదీ అద్భుతంఅసాధారణమైనదిదేశంలోని పిల్లలు 'ఏ అంటే అస్సాంఅని నేర్చుకునే రోజు ఎంతో దూరంలో లేదని నేను తరచూ చెబుతుంటానుఅస్సాం సంస్కృతిగౌరవంఆత్మగౌరవంతో పాటు అపారమైన అవకాశాలకు నిలయంఅస్సాం వస్త్రధారణఆహారంపర్యాటకంఉత్పత్తులకు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలిమీ అందరికీ తెలుసు… అస్సాం గమోసా బ్రాండింగ్‌ను నేను ఎంతో గర్వంగా ప్రచారం చేస్తుంటానుఅస్సాంలోని ప్రతి ఉత్పత్తిని ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు మనం చేరవేయాలి.

మిత్రులారా,

భూపేన్ దా జీవితం దేశ లక్ష్యాల కోసమే అంకితమైందిభూపేన్ దా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దేశ స్వావలంబనకు మనం పట్టుదలగా సంకల్పం తీసుకోవాలిఅస్సాంలోని నా సోదరీసోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నామనం వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలిస్వదేశీ వస్తువుల పట్ల మనం గర్వపడాలిమనం స్వదేశీ వస్తువులనే కొనాలిస్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలిఈ ప్రచారాలను మనం ఎంతగా ముందుకు తీసుకెళ్తే.. వికసిత్ భారత్ కల అంత త్వరగా సాకారమవుతుంది.

మిత్రులారా,

పదమూడేళ్ల వయసులో భూపేన్ దా ఒక పాట రాశారు: “అగ్నిజుగోర్ ఫిరింగోటి మోయినోతున్ భారత్ గాధీమ్హర్బోహరర్ హర్బోష్వో పునోర్ ఫిరై అనిమ్నోతున్ భారత్ గాధీమ్”

మిత్రులారా,

ఈ పాటలో తనను తాను నిప్పుకణికగా ఆయన భావించుకున్నారునవ భారతాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారుబాధితులుఅణగారిన వర్గాలు తిరిగి తమ హక్కులు పొందేలా నూతన భారతాన్ని ఆవిష్కరిస్తానని ఆయన సంకల్పించుకున్నారు.

సోదరీసోదరులారా,

నవ భారతం కోసం భూపేన్ దా ఆనాటి దార్శనికత.. నేడు దేశ దృఢ సంకల్పంగా మారిందిమనం కూడా ఆ సంకల్పంతో మమేకమవ్వాలిప్రతి ప్రయత్నంప్రతి లక్ష్యం వెనుక వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని ఉంచాల్సిన సమయమిదిభూపేన్ దా రాసిన పాటలుఆయన జీవితం ఈ ప్రయాణంలో మనకు స్ఫూర్తినిస్తాయిమన ఈ పట్టుదలే భూపేన్ హజారికా కలలను నిజం చేస్తుందిఈ స్ఫూర్తితో భూపేన్ దా శత జయంతి సంవత్సర సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామీ అందరినీ నేను కోరుతున్నానుదయచేసి మీ మొబైల్ ఫోన్లను బయటకు తీసిఫ్లాష్‌లైట్‌ ఆన్ చేసిభూపేన్ దాకు నివాళులర్పించండివేల సంఖ్యలో వెలుగుతున్న ఈ దీపాలు... భూపేన్ దా అమర ఆత్మకు నివాళులర్పిస్తున్నాయినేటి తరం ఆయన గాత్రాన్ని వెలుగులతో అలంకరిస్తోందిమీకు నా ధన్యవాదాలు!

 

***


(రిలీజ్ ఐడి: 2254696) సందర్శకుల సూచీ సంఖ్య : : 19