ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్
అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవ విశేషాలను పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
20 DEC 2025 11:08PM by PIB Hyderabad
అస్సాంలోని గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి సంబంధించిన దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. అస్సాం అనుసంధానత, ఆర్థిక విస్తరణ, అంతర్జాతీయ అనుసంధానతలో ఈ టెర్మినల్ ఒక పరివర్తనాత్మక మైలురాయిగా నిలుస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు పోస్టులలో ప్రధాని మోదీ ఈ విధంగా పేర్కొన్నారు.
"గౌహతిలో ఈ రోజు ప్రారంభమైన విమానాశ్రయ టెర్మినల్ భవనంలో అడుగు పెట్టగానే 'అభివృద్ధి, వారసత్వం' అనే మంత్రం ఎంతటి ముఖ్యమైనదో స్పష్టంగా తెలుస్తుంది.”
"ఈ రోజు అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య భారత్.. దేశాభివృద్ధి, పర్యాటక రంగానికి కొత్త ప్రవేశద్వారంగా మారుతోంది. వారణాసి నుంచి డిబ్రూఘర్ వరకు సాగే గంగా విలాస్ క్రూయిజ్‌తో ఈశాన్య ప్రాంతం ప్రపంచ క్రూయిజ్ పర్యాటక మ్యాప్‌లో ఒక భాగంగా స్థిరపడింది."
"అస్సాం, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పాపం వల్ల దేశ భద్రత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత 10-11 ఏళ్లలో మా ప్రయత్నాల ఫలితంగా అస్సాం వనరులు అస్సాం ప్రజలకే ఉపయోగపడేలా చేయడం ఖాయమైంది."
"గౌహతి విమానాశ్రయంలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఆయన జీవితం, ఆదర్శాలు.. అస్సాం ప్రగతికి ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి."
"లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం అందుబాటులోకి వచ్చింది కాబట్టి గౌహతికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ కొత్త టెర్మినల్ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు ప్రకృతి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ప్రశంసనీయం."
"అద్భుతమైన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు గౌహతి. ఈ చైతన్యవంతమైన నగరంలో ఉండటం ఎప్పుడూ ఆనందదాయకమే."
***
(रिलीज़ आईडी: 2254544)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam