ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ శివరాజ్ పాటిల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 12 DEC 2025 10:26AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ శివరాజ్ పాటిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అనుభవజ్ఞులైన నాయకుడిగా శ్రీ పాటిల్‌ను ప్రధానమంత్రి అభివర్ణించారు.

ప్రధానమంత్రి తన సందేశంలో శ్రీ పాటిల్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ పాటిల్ తన సుదీర్ఘమైన, విశిష్టమైన ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా, లోక్‌సభ స్పీకర్‌ సహా పలు హోదాల్లో దేశానికి సేవలందించారని అన్నారు. శ్రీ పాటిల్ సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధతతో, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన అంకితభావంతో పని చేశారని తెలిపారు.

గత కొన్నేళ్లుగా శ్రీ పాటిల్‌తో ఉన్న తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. కొద్ది నెలల కిందట శ్రీ పాటిల్ తన నివాసానికి వచ్చిన సమయంలో చివరగా ఆయనతో సమావేశమైనట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“ఎక్స్” వేదికగా చేసిన పలు పోస్టులలో, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"శ్రీ శివరాజ్ పాటిల్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గానూ, అలాగే లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలందించిన అనుభవజ్ఞులైన నాయకుడాయన. సమాజ సంక్షేమానికి కృషి చేయడమంటే ఆయనకు ఎంతో మక్కువ. గత కొన్నేళ్లుగా అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడే అవకాశం లభించింది. కొన్ని నెలల కిందటే నా నివాసానికి వచ్చిన సందర్భంలో ఆయనతో చివరగా మాట్లాడాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి."

 

***


(రిలీజ్ ఐడి: 2254490) సందర్శకుల సూచీ సంఖ్య : : 31