ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వయోజన విద్య ముఖచిత్రాన్ని మారుస్తూ, అక్ష్యరాస్యత లక్ష్యాల దిశగా సాగుతున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2025 12:27PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం 2022లో ప్రారంభించిన అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్కార్యక్రమం చూపించిన గుణాత్మక ప్రభావాన్ని ప్రశంసిస్తూ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుగ్రామీణులుమహిళలపై ప్రధాన దృష్టి సారించి దేశవ్యాప్తంగా ఉన్న వయోజనులకు విద్యావకాశాలను ఈ కార్యక్రమం గణనీయంగా విస్తరించింది.

కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌధరి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు పీఎంవో ఇండియా హ్యాండిల్ స్పందన:

‘‘ఎన్ఈపీ 2020 ప్రకారం 2022లో ప్రారంభించిన అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్కార్యక్రమం వయోజనులకు చదువుకొనే అవకాశాలను ఏ విధంగా అందిస్తుందో ఈ కథనంలో సహాయ మంత్రి శ్రీ శ్రీ జయంత్ చౌధరి వివరించారు.

 

ఉల్లాస్ కార్యక్రమం.. గ్రామీణమహిళా అక్షరాస్యతను గణనీయంగా పెంపొందించిందని, 2030 నాటికి సాధించాలని యూఎన్ నిర్దేశించిన ఎస్డీజీల్లో భాగమైన అక్షరాస్యతా లక్ష్యాన్ని చేరుకొనే దిశగా భారత్‌ను నడిపిస్తోందని ఆయన వివరించారు.’’


(రిలీజ్ ఐడి: 2254285) సందర్శకుల సూచీ సంఖ్య : : 9