ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 21న రాజస్థాన్‌లో ప్రధాని పర్యటన


బతోత్రా లోని పచ్‌ప్రదలో నిర్మించిన దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ శుద్ధి,

పెట్రో రసాయనాల కర్మాగార సముదాయాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని

రూ. 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన 9ఎంఎంటీపీఏ సామర్థ్యమున్న రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్

ఒకే చోట చమురుశుద్ధి, పెట్రో ఆధారిత ఉత్పత్తుల తయరీ

భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, పెట్రో రసాయనాల్లో

స్వయం సమృద్ధిని విస్తరించడంలో కీలకపాత్ర పోషించనున్న ప్రాజెక్టు

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 12:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 21న రాజస్థాన్లో పర్యటిస్తారుఆ రోజు ఉదయం 11:30 గంటలకు బలోత్రాలోని పచ్‌పద్రా వద్ద దేశంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిన సమీకృత చమురుశుద్ధిపెట్రో రసాయన కర్మాగార సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారుఅక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

భారత దేశ ఇంధన భద్రతపెట్రోరసాయనాల రంగంలో సాధించిన విజయాన్ని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సూచిస్తుందిహిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయిఏడాదికి మిలియన్ల మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏసామర్థ్యం ఉన్న ఈ చమురు శుద్ధిపెట్రో రసాయనాల సముదాయాన్ని రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించారు.

 

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ సముదాయం 2.4 ఎంఎంటీపీఏల సామర్థ్యంతో చమురు శుద్ధినిపెట్రో రసాయనాల ఉత్పత్తిని ఏకీకృతం చేస్తుందిసామర్థ్యంసుస్థిరతలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చమురు శుద్ధి కర్మాగారం 17.0 అధిక నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్సును కలిగి ఉంది. 26 శాతం కంటే ఎక్కువ పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

 

దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలోపెట్రో రసాయనాల్లో స్వయం సమృద్ధిని విస్తరించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారుఅలాగేఈ ప్రాంతంలో పెట్రో రసాయనప్లాస్టిక్ పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రధాన పరిశ్రమగా పనిచేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలనుఅనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుందిఅదనంగాగణనీయ స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పించి.. ఈ ప్రాంత సామాజికఆర్థికాభివృద్ధికి ఈ చమురుశుద్ధి కర్మాగారం సహకారం అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2253762) సందర్శకుల సూచీ సంఖ్య : : 19