ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 APR 2026 8:38AM by PIB Hyderabad

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
బసవ జయంతి విశిష్ట సందర్భంగా జగద్గురు బసవేశ్వరకూకలకాలం నిలిచి ఉండే ఆయన బోధనలకూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని శ్రీ మోదీ అన్నారుసమాజాన్ని న్యాయపూర్ణమైందిగా తీర్చిదిద్దాలని బసవేశ్వర తపించారనీప్రజలకు సాధికారతను కల్పించడానికి అవిరామ కృషి చేశారనీఇవి మనకు సదా స్ఫూర్తినిస్తాయనీ ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
బసవ జయంతి విశిష్ట సందర్భంగాజగద్గురు బసవేశ్వరకూకలకాలం నిలిచి ఉండే ఆయన బోధనలకూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానుసమాజాన్ని న్యాయపూర్ణమైందిగా తీర్చిదిద్దాలని బసవేశ్వర తపించారు.. ప్రజలకు సాధికారతను కల్పించడానికి అకుంఠిత కృషి చేశారు.. ఇవి మనకు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తాయి’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2253668) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam