ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్.. . పశ్చిమ ఆసియాలో స్థితితో పాటు నౌకావాణిజ్య భద్రతపై చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 10:24PM by PIB Hyderabad
ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ పశ్చిమ ఆసియాలో ప్రస్తుత స్థితిపై చర్చించారు. హర్మూజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడం, నౌకాయాన స్వతంత్రతను నిర్ధారించ వలసిన అవసరం ఎంతైనా ఉందని వారు అంగీకరించారు.
ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెలుపలా శాంతిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో సన్నిహిత సహకారాన్ని ఇకమీదట కూడా కొనసాగిద్దామంటూ నేతలిద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:..
‘‘నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నాకు ఫోన్ చేశారు. మేం పశ్చిమ ఆసియాలో స్థితిపై చర్చించాం. హర్మూజ్ జలసంధిలో భద్రత, నౌకాయాన స్వతంత్రతను వెనువెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంగీకరించాం.
ఆ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం వెలుపల కూడా శాంతిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా మేం సన్నిహిత సహకారాన్ని ఇక ముందు కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252845)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12