హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళా రిజర్వేషన్ బిల్లు నేటి తక్షణావసరమన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చి, అమలు చేసేందుకు సంకల్పించిన మోదీ ప్రభుత్వం

విధాన రూపకల్పనలో పాల్గొనడానికి, దేశాన్ని శక్తిమంతం చేసే దిశగా మన నారీ శక్తికి దక్కాల్సిన న్యాయబద్ధమైన హక్కు

ఎటువంటి జాప్యం లేకుండా సానుకూల మార్పు కోసం తప్పక జరగాల్సిన పరిణామం ఇది

ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 4:41PM by PIB Hyderabad

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రస్తుతం అత్యంత అవసరమని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారుఈ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం నిశ్చయించుకుందని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో అమిత్‌ షా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రస్తుత తరుణంలో అత్యంత అవశ్యకంవిధాన రూపకల్పనలో పాలుపంచుకునిదేశాన్ని బలోపేతం చేయడానికి మన నారీశక్తికి ఇది దక్కాల్సిన న్యాయబద్ధమైన హక్కుఈ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందిసమాజ శ్రేయస్సు ఆలస్యం లేకుండా ఈ మార్పు ఖచ్చితంగా జరగాలిఈ చారిత్రాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను’’

***


(రిలీజ్ ఐడి: 2252056) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Telugu , Kannada