పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 9వ తేదీ నుంచి 10, 2026 వరకు ఖతార్‌లోని దోహాలో


పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్రమంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి పర్యటన

प्रविष्टि तिथि: 10 APR 2026 2:42PM by PIB Hyderabad

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం పెట్రోలియంసహజవాయువుల శాఖ గౌరవ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి ఏప్రిల్ 9వ తేదీన మధ్యాహ్నం దోహాకు చేరుకున్నారుసాయంత్రం ఖతార్ ఇంధన వ్యవహారాల శాఖ సహాయమంత్రిఖతార్ ఎనర్జీ ప్రెసిడెంట్సీఈఓ గౌరవ సాద్ షెరిదా అల్-కాబీతో సమావేశమయ్యారు.

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకిఖతార్ ప్రధానమంత్రివిదేశాంగ మంత్రి గౌరవ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమన్ అల్ థానీకి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరపున సందేశాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

మార్చి 2026లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పీఎం మోదీగౌరవ అమీర్ మధ్య జరిగిన రెండు ఫోన్ సంభాషణలను గుర్తు చేసుకున్నారుశాంతిస్థిరత్వాన్ని పునరుద్ధరించటానికి చర్చలుదౌత్య మార్గాల ప్రాముఖ్యతను ఇరువురు నేతలు స్పష్టం చేశారుఖతార్ లోని భారత సమాజం పట్ల చూపిన ఆదరణఅందించిన మద్దతుకు గానూ గౌరవ అమీర్‌కు పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారుఇందులో ఉన్నతస్థాయి చర్చలువాణిజ్యంపెట్టుబడులుఇంధనంసంస్కృతిప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలున్నాయిత్వరలో పశ్చిమాసియాలో శాంతిస్థిరత్వం నెలకొంటాయని.. భారత్ఖతార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కాంక్షించారు.

విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగా కొనసాగేందుకు ఖతార్ కట్టుబడి ఉందనిభారత్‌తో ఇంధన సంబంధాలనుసహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని గౌరవ మంత్రి సాద్ షెరీదా అల్-కాబీ స్పష్టం చేశారు.

ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం తెలపటాన్ని ఇరువురు మంత్రులు స్వాగతించారుప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయానికి ముగింపు పలికిసాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారుఈ నేపథ్యంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలను కాపాడేందుకు నిరంతర నౌకాయాన స్వేచ్ఛఅంతర్జాతీయ వాణిజ్య ప్రవాహం అవసరమని తెలిపారు.

తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఖతార్ ఇంధన శాఖ సహాయమంత్రి గౌరవ సాద్ షెరీదా అల్-కాబీకి కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారురాబోయే వారాల్లో నిరంతరం అందుబాటులో ఉండాలని ఇరువురు మంత్రులు నిర్ణయించుకున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2251022) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam