ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ ప్రజల ఆరోగ్యం, సంరక్షణ వ్యవస్థలో హోమియోపతి ప్రాముఖ్యతను తెలిపే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 1:06PM by PIB Hyderabad
భారతదేశ సమగ్ర ఆరోగ్యం, సంరక్షణ వ్యవస్థలో హోమియోపతి అంతర్భాగంగా మారిన తీరుని వివరిస్తూ.. కేంద్ర సహాయమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"భారతదేశ సమగ్ర ఆరోగ్యం, సంరక్షణ వ్యవస్థలో హోమియోపతి అంతర్భాగంగా మారిన తీరుని కేంద్ర సహాయమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఈ కథనంలో వివరించారు. రోగి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ ఆరోగ్య దృక్పథంతో ఇది చికిత్స అందిస్తుందని ఆయన తెలిపారు.
లోతైన సామాజిక అనుసంధానం, సుస్థిర విధానంలో సేవలందించే హోమియోపతి వైద్యం, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు"
***
(రిలీజ్ ఐడి: 2250735)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Kannada
,
Malayalam