హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళి అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


1965లో ఇదే రోజున రాణ్ ఆఫ్ కచ్ లోని సర్వార్ పోస్టు వద్ద దుర్భేద్య కుడ్యంలా నిలిచిన సీఆర్పీఎఫ్ యోధులు

దేశ గౌరవం, భద్రత కోసం ప్రాణాలర్పించిన అమరులకు మనఃపూర్వక నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 2:11PM by PIB Hyderabad

సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా.. కేంద్ర రిజర్వు పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్అమర వీరులకు కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: - “సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా మన వీర సైనికుల అకుంఠిత ధైర్యసాహసాలకూత్యాగాలకూ ప్రణమిల్లుతున్నాను. 1965లో ఇదే రోజున సీఆర్పీఎఫ్ వీర యోధులు వెన్నుచూపకుండా పోరాడారుచొచ్చుకొస్తున్న శతృమూకలను అణచివేస్తూ.. రాణ్ ఆఫ్ కచ్ లోని సర్దార్ పోస్టు వద్ద దుర్భేద్యమైన కుడ్యంలా ఎదురు నిలిచారుధైర్యసాహసాలతో దేశ చరిత్రలో అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించారుదేశ గౌరవంభద్రత కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మనఃపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.”


(రిలీజ్ ఐడి: 2250466) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada