ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధాని మోదీతో రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్‌ భేటీ


వాణిజ్యం, ఎరువులు, అనుసంధానం, ప్రజా సంబంధాల్లో పురోగతిని భారత ప్రధానికి వివరించిన రష్యా మొదటి ఉప ప్రధాని

2025 డిసెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయవంతమైన భారత పర్యటనను గుర్తు చేసుకున్న శ్రీ మోదీ

శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు దిశగా నిరంతర కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన భారత ప్రధాని

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 7:21PM by PIB Hyderabad

గౌరవ రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్.. ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

వాణిజ్య - ఆర్థిక భాగస్వామ్యం, ఎరువులు, అనుసంధానం, ప్రజా సంబంధాలు సహా.. ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన వివిధ రంగాల్లో సహకారంతో సాధించిన పురోగతిని రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి మంతురోవ్ భారత ప్రధానమంత్రికి వివరించారు.

2025 డిసెంబరులో 23వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో విజయవంతంగా పర్యటించిన సందర్భాన్ని భారత ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భారత్ - రష్యా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా.. వార్షిక శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు దిశగా ఇరుపక్షాల నిరంతర కృషి పట్ల శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ.. ఇరు దేశాల మధ్య నిరంతర చర్చలు ఇకముందూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2248687) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati