ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్ఈపీ- 2020 తో భారత్ కుతూహలాన్నీ, సంపూర్ణ అభివృద్ధినీ నిరంతరం ప్రోత్సహిస్తోందని వివరించిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 8:08PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)- 2020లో భాగంగా మౌలిక అక్షరాస్యతపైనా, విద్యార్థులు ఉల్లాసంతో చదువుకోవడంపైనా భారత్ అమితంగా దృష్టి సారిస్తూ కుతూహలాన్నీ, సంపూర్ణ అభివృద్ధినీ నిరంతరం ప్రోత్సహిస్తోందని మంత్రి ఆ వ్యాసంలో వివరించారు. బడిలో మొదటి రోజును ఒక ఆరంభంగా మాత్రమే కాకుండా దానిని విద్యార్థుల ఉమ్మడి జాతీయ బాధ్యతగా చూస్తూ, ఆ బాధ్యతను మనసు లోలోపలకు ఇముడ్చుకోవాలని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘బడిలో మొదటి రోజు కేవలం ఒక ఆరంభం కాదు... అది విద్యార్థుల మధ్య ఓ ఉమ్మడి జాతీయ బాధ్యత.. ఈ బాధ్యతను విద్యార్థులు తమ మనసు లోలోపలకు ఇముడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఈపీ-2020లో భాగంగా, మౌలిక అక్షరాస్యతతో పాటు విద్యార్థులు ఉల్లాసంతో చదువుకోవడంపైనా భారత్ అమితంగా దృష్టి కేంద్రీకరిస్తూ వారిలో కుతూహలాన్నీ, సంపూర్ణ అభివృద్ధినీ నిరంతరం ప్రోత్సహిస్తోంది.
దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన ఈ వ్యాసాన్ని చదవండి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2248102)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam