సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
తప్పుడు సమాచారంపై ప్రభుత్వం పటిష్ట చర్యలు.. 2,900కిపైగా నిజనిర్ధారణలను జారీ చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 3:39PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి, అరికట్టడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఇది ప్రభుత్వ వార్తలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించి, వాస్తవాలను తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. అలాగే అనుమానాస్పద కంటెంట్‌ను నివేదించవలసిందిగా పౌరులను ప్రోత్సహించడం ద్వారా తప్పుడు సమాచార నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డీప్‌ఫేక్స్, కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన తప్పుడు వీడియోలు, నకిలీ నోటిఫికేషన్లు, లేఖలు, వెబ్సైట్లతో కూడిన వివిధ రకాల అసత్య ప్రచారాలనుఫ్యాక్ట్ చెక్ విభాగం గుర్తించింది. ఇప్పటివరకు మొత్తం 2,913 నిజనిర్ధారణ కథనాలను ప్రచురించింది. ఈ వివరాలన్నీ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్ ఛానెల్ లో అందుబాటులో ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారాన్ని, దేశ వ్యతిరేక కథనాలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వేగంగా గుర్తించి అడ్డుకుంది. అబద్ధపు ప్రచారాలపై తక్షణమే స్పందిస్తూ.. వాస్తవ సమాచారాన్ని అందించడం ద్వారా తప్పుదోవ పట్టించే కథనాలు వ్యాపించకుండా అడ్డుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా డిజిటల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సుమారు 1,400కు పైగా యూఆర్ఎల్ లను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
డిజిటల్ మీడియాలో వార్తలు, వర్తమాన అంశాలను ప్రచురించేవారు, ఆన్లైన్ కంటెంట్ పబ్లిషర్ల కోసం సమాచార సాంకేతిక (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021 ఒక నైతిక నియమావళిని రూపొందించాయి. ఈ నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ సమాచారాన్ని నేడు లోక్‌సభలో శ్రీ వీకే శ్రీకందన్ అడిగిన ప్రశ్నకు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2247878)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10