సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓటీటీ వేదికలకు మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం


శ్రవణ, దృశ్య శక్తి లోపాలతో బాధపడుతున్న వీక్షకులకు సౌకర్యాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 3:48PM by PIB Hyderabad

వినికిడి శక్తి లోపంతోచూపుడు శక్తి లోపంతో బాధపడుతున్న వీక్షకుల కోసం ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంటును అందించే వేదికలకు (ఓటీటీ ప్లాట్‌ఫారాలుకంటెంట్ సౌలభ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 6న జారీ చేసింది.
ఈ మార్గదర్శకాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లోని  https://mib.gov.in → Home →Documents →Acts, Policies & Guidelines చిరునామాలో అందరికీ అందుబాటులో ఉన్నాయి:
శ్రవణ శక్తి లోపంతోనూదృశ్య శక్తి లోపంతోనూ బాధపడుతున్న వారికి ఓటీటీ వేదికల్లో ఆడియో-విజువల్ కంటెంటును సులభంగా అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను తీసుకువచ్చారుదీని కోసం ఒక కార్యాచరణ షెడ్యూలును కూడా ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
ఓటీటీ వేదికల్లో కొత్తగా ప్రచురించే కంటెంటులోవినికిడి లోపం కలిగిన వారితో (క్లోజ్‌డ్ కేప్షనింగ్ లేదా ఓపెన్ కేప్షనింగ్ లేదా భారతీయ సంజ్ఞా భాషపాటుదృశ్య జ్ఞానం లోపించిన వారి (ఆడియో డిస్క్రిప్టర్స్కోసం నిర్దిష్ట కార్యాచరణ షెడ్యూలులో పేర్కొన్నట్లుగా కనీసం ఒక లభ్యతా సౌకర్యాన్ని జోడించాలని ఈ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
రాజ్యసభలో శ్రీమతి మాయా నరోలియా అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ ఈ మేరకు సమాధానాన్ని ఇచ్చారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246106) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Kannada , Malayalam