సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆకాశవాణిలో మార్చి 26 నుంచి పూర్తిగా ప్రసారం కానున్న జాతీయ గేయం వందేమాతరం


సంగీత వైవిధ్యాన్ని ప్రదర్శించేలా ప్రాంతీయ భాషల్లో రికార్డు చేసిన ఆరు చరణాల ‘వందేమాతరం’

प्रविष्टि तिथि: 25 MAR 2026 2:02PM by PIB Hyderabad

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆకాశవాణి కేంద్రాల్లో సిగ్నేచర్ ట్యూన్ అనంతరం రెండు చరణాల జాతీయ గేయం ‘‘వందేమాతరం’’ (65 సెకన్ల నిడివి)తో ఉదయకాల ప్రసారాలను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది.

2026 జనవరి 28న హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలు 2026 మార్చి 26 నుంచి ఆరు చరణాలున్న జాతీయ గేయాన్ని ప్రసారం చేస్తాయిదీని నిడివి నిమిషాల 10 సెకన్లు.

త్వరలో ప్రసారమయ్యే జాతీయ గేయ మాతృకను ప్రఖ్యాత హిందీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు పండిట్ చంద్రశేఖర వాజే.... దేశ్య రాగంలో ఆలపించారు.

 

జాతీయ గేయ ఇతర అనువాదాలను కూడా ప్రాంతీయ సంగీత వాయిద్యాల వైవిధ్యానికి అనుగుణంగా రికార్డు చేస్తున్నారుఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆకాశవాణి కేంద్రాలు వాటిని ప్రసారం చేస్తాయి

 

****


(रिलीज़ आईडी: 2245037) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam