ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కూలిన భవనం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 5:40PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున హరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కూలిపోవడం వల్ల సంభవించిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్ట సమయంలో బాధితులకువారి కుటుంబాలకు నా సానుభూతి  తెలియజేస్తున్నా. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’


(రిలీజ్ ఐడి: 2244204) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati