ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జల పరిపాలనపై దేశ సమగ్ర దృక్పథాన్ని తెలుపుతూ రాసిన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 4:29PM by PIB Hyderabad

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ రచించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. జల భద్రతతో కూడిన భవిష్యత్తును సాధించడం కోసం భారత్‌ అనుసరిస్తున్న సమగ్ర దార్శనికతను ఈ వ్యాసం వివరిస్తుంది.

నీటి సంరక్షణ, సుస్థిర వినియోగం క్రియాశీల సమాజ భాగస్వామ్యం వంటి పునాదులపై జల పరిపాలనపై దేశవిధానం నిర్మితమైందని ఈ వ్యాసం తెలుపుతుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సంపూర్ణ, సమీకృత జల నిర్వహణ దిశగా జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఒక నిర్ణయాత్మక మార్పును ఎలా సూచించిందో కూడా ఇది వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

"కేంద్ర మంత్రి శ్రీ సీఆర్‌ పాటిల్‌ రాసిన ఈ వ్యాసం దేశ జల పరిపాలన సమగ్ర దార్శనికతను వివరిస్తుంది. సంరక్షణ, సుస్థిర వినియోగం, ప్రజల భాగస్వామ్యం కలిసి నీటి భద్రత కలిగిన భవిష్యత్తు వైపు మన ప్రయాణాన్ని బలోపేతం చేస్తున్నాయి.

జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు దేశంలో సమగ్ర జల నిర్వహణ దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును ఎలా సూచించిందో కూడా ఆయన ఇందులో స్పష్టం చేశారు.’’


(రిలీజ్ ఐడి: 2243462) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada