హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీరాంగన రాణి అవంతీబాయి లోధీ అమరత్వ దినం సందర్భంగా నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ధైర్యం, త్యాగం, దేశభక్తిలకు సాటిలేని ఉదాహరణగా నిలిచే వీరాంగన రాణి అవంతీబాయి లోధీ జీవితం

1857 తిరుగుబాటు కాలంలో, బ్రిటిషు వారిపై పోరాడిన పరాక్రమవంతురాలు...

లొంగుబాటు కన్నా అమరత్వాన్నే ఎంచుకున్న రాణి

प्रविष्टि तिथि: 20 MAR 2026 11:39AM by PIB Hyderabad

వీరాంగన రాణి అవంతీబాయి లోధీ అమరత్వ దినం ఈ రోజు. ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘వీరాంగన రాణి అవంతీబాయి లోధీ జీవితం ధైర్యసాహసాలకీ, త్యాగానికీ, దేశభక్తికీ సాటిలేని ఉదాహరణ. 1857 తిరుగుబాటు కాలంలో, ఆమె బ్రిటిషు వారిని ఎదిరించి దృఢనిశ్చయంతో పోరాడారు.. ఆ క్రమంలో, లొంగుబాటు కన్న ప్రాణ త్యాగానికే మొగ్గు చూపారు. దేశం పట్ల అంకిత భావాన్ని, ఆత్మగౌరవాన్ని విడనాడకూడదన్న శాశ్వత సందేశాన్ని  ఆమె త్యాగం  సూచిస్తోంది. రాణి అమరత్వ దినం సందర్భంగా ఆమెకు నేను వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2242870) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada