ప్రధాన మంత్రి కార్యాలయం
ఖతార్ పాలకుడితో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపి... ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 10:54PM by PIB Hyderabad
ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రాంతీయ భద్రత పరమైన ఆందోళనలపై చర్చించారు.
ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. ఈద్‌ను పురస్కరించుకొని ఖతార్ పాలకునికీ, ఖతార్ ప్రజలకూ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చర్చలో భాగంగా ఖతార్ వెన్నంటి భారత్ నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని సంరక్షిస్తుండటంతో పాటు వారికి సహాయపడుతున్నందుకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వర్ధిల్లాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగా, స్వేచ్ఛగా సాగాలన్నదే తమ ఉమ్మడి వైఖరి అని నేతలిద్దరూ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నా సోదరుడు, ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడి, ఆయనతో పాటు ఖతార్ ప్రజలకు ఈద్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
ఆ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఖతార్ వెన్నంటి నిలుస్తామని పునరుద్ఘాటించాను.
భారతీయ సమాజాన్ని సంరక్షిస్తున్నందుకు, సాయాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాను. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలదే పైచేయి కావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాను.
హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగా, స్వేచ్ఛాయుతంగా సాగాలన్న వాదనను మేం సమర్ధిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2242868)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5