ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడిన భారత ప్రధాని


పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ.. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2026 5:05PM by PIB Hyderabad

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించి చర్చలనూ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా చర్చించారు. ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించడంతోపాటు శాంతినీ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా ప్రియ మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను.

ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చాం.’’

 

***


(రిలీజ్ ఐడి: 2242666) సందర్శకుల సూచీ సంఖ్య : : 78