సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం 2023తో పైరసీ నిరోధక వ్యవస్థ బలోపేతం.. నేరస్థులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు జరిమానా


పైరసీపై కేంద్రం ఉక్కుపాదం.. 3,142 టెలిగ్రామ్ ఛానళ్లకు నోటీసులు, 800 వెబ్‌సైట్ల నిలిపివేత

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 3:19PM by PIB Hyderabad

సినిమా పైరసీని అరికట్టడానికి చట్టపరమైన వ్యవస్థను సినిమాటోగ్రాఫ్ (సవరణచట్టం 2023 మరింత బలోపేతం చేసిందిసినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ ప్రకారం అనుమతి లేకుండా సినిమాలను రికార్డ్ చేయడంవాటిని ప్రసారం చేయడం నిషేధంసెక్షన్ 7(1ప్రకారం ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి కనీసం నెలల జైలు శిక్షరూ. 3 లక్షల జరిమానా విధిస్తారునేరం తీవ్రతను బట్టి దీనిని ఏళ్ల జైలు శిక్ష వరకుఅలాగే ఆడిట్ చేసిన స్థూల నిర్మాణ వ్యయంలో శాతం వరకు జరిమానా విధించవచ్చుఐటీ చట్టం 2000 లోని సెక్షన్ 79(3) ప్రకారం పైరసీ కంటెంట్‌ కలిగి ఉన్న లేదా ప్రసారం చేస్తున్న మధ్యవర్తిత్వ సంస్థలకు నోటీసులు ఇచ్చేందుకు  సెక్షన్ 7(1బీ)(ii) ద్వారా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది

పైరసీని అరికట్టేందుకు నవంబర్‌ 2023 నాటి బహిరంగ నోటీసులో సూచించిన నిర్దేశిత రూపంలో ఫిర్యాదులను స్వీకరించడానికి నోడల్ అధికారులతో ఒక సంస్థాగత యంత్రాంగాన్ని కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిఇందులో సినిమా అసలు కాపీరైట్ యజమానులువారు అధికారం ఇచ్చిన వ్యక్తులు లేదా ఇంటర్నెట్‌లో పైరసీ కాపీల ప్రదర్శన గురించి సమాచారం ఉన్న ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుఫిర్యాదు అందిన వెంటనే.. గుర్తించిన పైరసీ లింకులను నిలిపివేయడానికి సంబంధిత వెబ్‌సైట్లుసోషల్ మీడియా సంస్థలకు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది

చట్టవిరుద్ధమైన చర్యలు లేదా కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వాలు నోటీసు ఇచ్చినప్పుడుఅటువంటి కంటెంట్‌ను తొలగించడానికి ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)(బీఅవకాశం కల్పిస్తుందికోర్టు ఉత్తర్వు ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వందాని గుర్తింపు పొందిన సంస్థ ద్వారా నోటీసు అందినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించే ఏ కంటెంట్‌నైనా మధ్యవర్తిత్వ సంస్థలు దానిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది

ఐటీ చట్టం 2000 కింద సమాచార సాంకేతిక (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలుడిజిటల్ మీడియా నైతిక నియమావళినిబంధనలు 2021ని భారత ప్రభుత్వం నోటిఫై చేసిందిసామాజిక మాధ్యమాలతో సహా అన్ని మధ్యవర్తిత్వ సంస్థలు తమ వేదికలపై ప్రదర్శించేఅప్లోడ్ చేసేప్రచురించేప్రసారం చేసేనిల్వ చేసేషేర్ చేసే సమాచారానికి సంబంధించి ఐటీ నియమాలు 2021లోని రెండో భాగం కొన్ని నిర్దిష్ట బాధ్యతలను విధిస్తుంది

సమాచార సాంకేతిక (మధ్యవర్తుల మార్గదర్శకాలుడిజిటల్ మీడియా నీతి నియమావళినిబంధనలలోని నియమం 3(1)(బీప్రకారం మధ్యవర్తులు తమంతట తాముగా తగిన జాగ్రత్తలుప్రయత్నాలు చేయాలిఏదైనా పేటెంట్ట్రేడ్‌మార్క్కాపీరైట్ లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించే ఎటువంటి సమాచారాన్ని అయినా సరే... కలిగి ఉండటానికిప్రదర్శించడానికిఅప్‌లోడ్ చేయడానికిసవరించడానికిప్రచురించడానికిప్రసారం చేయడానికినిల్వ చేయడానికిఅప్‌డేట్ చేయడానికి లేదా షేర్‌ చేయడానికి అనుమతి ఉండదు

పైరసీ వ్యతిరేక చర్యలు 

పైన పేర్కొన్న చట్టపరమైన నిబంధనల మేరకు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)(b) ప్రకారం టెలిగ్రామ్ యాప్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందివివిధ ఓటీటీ వేదికల్లో నిర్మాణ సంస్థలకు చెందిన సమాచారాన్ని ఎలాంటి అనుమతి లేకుండా కాపీరైట్ చట్టం 1957ను ఉల్లంఘిస్తూ ప్రసారం చేస్తున్న 3,142 ఛానళ్లను తక్షణమే తొలగించాలనివాటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని 2026 మార్చి 11న ఆదేశించిందిదీనితో పాటు పైరసీ కంటెంట్‌ను కలిగి ఉన్న సుమారు 800 వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ప్రభుత్వం నిలిపివేసింది

ఈ సమాచారాన్ని సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నేడు లోక్‌సభలో శ్రీ ప్రద్యుత్ బోర్డోలోయ్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2242217) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Assamese , Bengali-TR , Bengali , Punjabi , Gujarati , Kannada