సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసార భారతి వైవిధ్యభరితమైన కంటెంట్ ను బలోపేతం చేస్తున్న వేవ్స్ ఓటీటీ .. ఈ వేదికలో ఇప్పటికే 84 లక్షలకు పైగా వినియోగదారుల నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 3:16PM by PIB Hyderabad

నవంబర్ 2024న  వేవ్స్ ఓటీటీని ఒక డిజిటల్ స్ట్రీమింగ్ వేదికగా ప్రసార భారతి ప్రారంభించింది. రేడియో, టీవీ ఛానెళ్లు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యక్ష ప్రసారాలు,  సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు, ప్రసార భారతికి చెందిన చారిత్రక కంటెంట్‌తో సహా విభిన్న రకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే దీని లక్ష్యం. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా వినియోగదారులతో సహా ఈ వేదికకు ఇప్పటికే 84 లక్షల కంటే ఎక్కువ మంది నమోదిత వినియోగదారులు ఉన్నారు.

ప్రసార భారతి- ప్రసారం, వ్యాప్తి కోసం భాగస్వామ్య దృశ్య శ్రవణ మాధ్యమం (పీబీ-శబ్ద్) మార్చి 2024లో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా తెలుగు, అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, డోగ్రీ, ఉర్దూ వంటి 15 భారతీయ భాషలలో వార్తల పంపిణీని సులభతరం చేస్తుంది. తొలుత ఈ సేవలు వినియోగదారులకు ఒక సంవత్సరంపాటు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత దీనిని మార్చి 2027 వరకు పొడిగించారు.

టెలివిజన్ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ సినిమాలు, ఇతర కార్యక్రమాలతో కూడిన ప్రసార భారతికి చెందిన భారీ చారిత్రక కంటెంట్ ను వేవ్స్ ఓటీటీ వేదికలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రేక్షకులకు ఈ పాత కార్యక్రమాలు సులభంగా దొరికేలా చేయడానికి, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ ప్రక్రియను దశలవారీగా చేపడుతున్నారు.

వేవ్స్ ఓటీటీ-పీబీ శబ్ద్ వేదికలు దేశవ్యాప్తంగా హిందీతో సహా వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసార భారతికి చెందిన కంటెంట్, కార్యక్రమాలు వార్తలను ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.  ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా ప్రాంతంలోని ప్రజలు కూడా ఈ వేదికల ద్వారా వివిధ భాషల్లో ప్రసార భారతి కంటెంట్‌ను సులభంగా పొందగలుగుతున్నారు.

సమాచార, ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని నేడు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241940) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Kannada , Malayalam